హనుమకొండ బస్టాండ్ క్యాంటీన్లో ఒక కస్టమర్ దోశ బిల్లు ఎగగొట్టేందుకు దారుణమైన పనిచేశాడు. ఆహారంలో వెంట్రుక వచ్చిందని, శుభ్రత లేదని గొడవ చేసి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఆ కస్టమరే వెంట్రుకను దోశ ప్లేట్లో వేసినట్లు బయటపడింది. ఆర్టీసీ అధికారులు షాకయ్యారు.