AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra – Viral Video: ఆనంద్ మహీంద్రా ట్వీట్.. వామ్మో అని హడలిపోతున్న నెటిజన్లు.. వీడియోను మీరూ చూసేయండి..

Anand Mahindra - Viral Video: మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టీవ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.

Anand Mahindra - Viral Video: ఆనంద్ మహీంద్రా ట్వీట్.. వామ్మో అని హడలిపోతున్న నెటిజన్లు.. వీడియోను మీరూ చూసేయండి..
Anand Mahindra
Shiva Prajapati
|

Updated on: Dec 31, 2021 | 4:14 PM

Share

Anand Mahindra – Viral Video: మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టీవ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన స్పందన అద్భుతం. ప్రతీ అంశంపై స్పాంటేనియస్‌గా స్పందిస్తుంటారు. సెలబ్రిటీలు మొదలు.. సామాన్యులు చేసే పోస్టులకు కూడా రెస్పాండ్ అవుతుంటారు. ఫన్నీ పోస్టులు చేస్తుంటారు. అదే సమయంలో.. గ్రామీణ ఆవిష్కరణలను, ట్యాలెంట్‌ను ప్రోత్సహిస్తుంటారు. నైపుణ్యం గల వారిని ప్రోత్సహించే క్రమంలో బహుమతులు కూడా ప్రకటిస్తుంటారు. అందుకే ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. యూజర్లు ఆయన చేసే పోస్టులను తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే, తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ షాకింగ్ వీడియోను సోషల్ మీడియోను చేశారు. ఆ వీడియో చూస్తే వామ్మో.. ఇదేంట్రా బాబూ అని భయమేయడం ఖాయం. సఫారీలో వెళ్తున్న మహీంద్రా ఎస్‌యూవీ వాహనాన్ని పెద్ద పులి అడ్డగించింది. ఆ తరువాత దానిపై అటాక్ చేసింది. కారు వెనుక వైపు బంపర్‌ను నోటితో కొరకడం మొదలు పెట్టింది. పులి తన పళ్లతో బంపర్‌ను కొరికి ధ్వంసం చేస్తోంది. కేవలం నోటితోనే కారును లాగిపడేసింది. దాంతో అందులో ఉన్న పర్యాటకులు హడలిపోయారు. సౌండ్ చేయకుండా భయంతో ముడుచుకుని కూర్చున్నారు. అదే సమయంలో మరో కారులో వచ్చిన పర్యాటకులు ఆ ఘటన అంతటినీ తమ కెమెరాల్లో వీడియో చిత్రీకరించారు. పులి తన నోటి కారును లాగడం అందరినీ హడలెత్తించగా.. పక్క కారులో ఉన్న వారు దానిని తరిమే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడ ఉన్నది పెద్ద పులి.. తగ్గేదే లేదన్నట్లుగా నోటితో కారును చీల్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్‌లో ఊటీ-మైసూర్ రహదారిపై చోటు చేసుకుంది.

అయితే, ఈ వీడియో ఇటు తిరిగి ఇటు తిరిగి ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఇంకేముంది.. ఆయన ఊరుకుంటారా? ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్ కూడా వదిలారు. 1.30 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన.. ‘‘ఊటీ-మైసూర్ రహదారిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఉన్నది గ్జైలో(Xylo) కారు. పులి దానిని కొరకడంలో నేనేం ఆశ్చర్య పోవడం లేదు. బహుశా పులి కూడా నాలాగే మహీంద్రా కార్లు డిలీసియస్ అని భావించినట్లుంది.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోపై యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Viral Video:

Also read:

Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్‏లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..

Shaikpet Flyover: హైదరాబాదీలకు తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుక.. రేపటి నుంచి అందుబాటులోకి ఆరు లైన్ల ప్లై ఓవర్..

Undavalli Sridevi ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై కోనసీమ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్..