ముక్కంటిని నేను.. అరుదైన పైథాన్

సాధారణంగా సరీసృపాలకు రెండు కళ్లు ఉంటే, ఇది మరో విచిత్రం. రెండు కళ్లతో పాటు మూడో కంటితో కూడిన ఓ పాము ఇటీవల హైవేపై దర్శనమిచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ఆస్ట్రేలియా డార్విన్ సమీపంలోని అర్న్‌హెమ్ హైవేపై ఈ అరుదైన కొండచిలువను ఆ మధ్య వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. మొదట రెండు కళ్లతోనే ఈ పైథాన్ చూస్తుందని భావించిన వారికి, ఇది ‘ఝలక్’ ఇచ్చింది. తన […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:09 pm, Thu, 2 May 19
ముక్కంటిని నేను.. అరుదైన పైథాన్

సాధారణంగా సరీసృపాలకు రెండు కళ్లు ఉంటే, ఇది మరో విచిత్రం. రెండు కళ్లతో పాటు మూడో కంటితో కూడిన ఓ పాము ఇటీవల హైవేపై దర్శనమిచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ఆస్ట్రేలియా డార్విన్ సమీపంలోని అర్న్‌హెమ్ హైవేపై ఈ అరుదైన కొండచిలువను ఆ మధ్య వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. మొదట రెండు కళ్లతోనే ఈ పైథాన్ చూస్తుందని భావించిన వారికి, ఇది ‘ఝలక్’ ఇచ్చింది. తన మూడో కన్ను కూడా పనిచేస్తుందని వారికి చెప్పకనే చెప్పింది. ఈ విషయాన్ని వారు ఎక్స్‌రే తీసి తెలుసుకోగలిగారు. ఇంతేకాదు ఈ పైథాన్‌కు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలిసింది. దీనిని తలలో రెండు పుర్రెలు లేవని, ఒకే పుర్రెపై మూడు కళ్లు ఉన్నట్లు తేలింది. సహజసిద్దమైన జన్యుమ్యుటేషన్ వల్ల ఇలా మూడు కళ్లు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.

https://www.facebook.com/ParksandWildlifeNT/posts/2284844224909161