ఆరి పిడుగా.. నువ్వు అసాధ్యుడివే..!

తబలా అంత లేడు ఆ బుడతడు. కానీ తబలాను వాయించడంలో మాత్రం నాకు నేను సాటి అంటున్నాడు. అంతేనా.. వచ్చీరాని మాటలతో ఆ పిల్లాడు ఒడియా పాటను పాడుతుంటే నెటిజన్లు వాహ్వా అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఒడియా సింగర్ సోనా మొహపాత్ర తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘ఈ వీడియోను చూస్తూ నన్ను నేను మరిచిపోయా’’ అంటూ ఆమె కామెంట్ పెట్టారు. ఆ తరువాత వేల షేర్లతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో […]

ఆరి పిడుగా.. నువ్వు అసాధ్యుడివే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 01, 2019 | 5:17 PM

తబలా అంత లేడు ఆ బుడతడు. కానీ తబలాను వాయించడంలో మాత్రం నాకు నేను సాటి అంటున్నాడు. అంతేనా.. వచ్చీరాని మాటలతో ఆ పిల్లాడు ఒడియా పాటను పాడుతుంటే నెటిజన్లు వాహ్వా అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఒడియా సింగర్ సోనా మొహపాత్ర తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘ఈ వీడియోను చూస్తూ నన్ను నేను మరిచిపోయా’’ అంటూ ఆమె కామెంట్ పెట్టారు. ఆ తరువాత వేల షేర్లతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘ఆ పిల్లాడి వేళ్లలో ఏదో రిథమ్ ఉంది. లేత బడుద్దాయి. ఇలానే ఎంకరేజ్ చేస్తే విద్వాంసుడైపోతాడని’’ ఒకరంటే.. ‘‘వాడి ఆత్మవిశ్వాసం తనను మురిపించిందని’’ మరొకరు ట్వీటించారు. మొత్తానికి ఈ బుడతడు ఇంటర్నెట్ షేక్ చేసేస్తున్నాడు.