మరీ ఇంత చిరాకా.. కియారా..?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెగ చిరాకు పడుతోంది. తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్న ఈ ఆధునిక రోజుల్లో తనకు నచ్చిన విధంగానే తానుంటానని పేర్కొంటూ తానే స్వయంగా తన జుట్టును కత్తిరించుకుంది. జుట్టు కత్తిరించుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కియారా. తన కజిన్ మ్యారేజ్‌కి వెళ్లేటప్పుడు తన తల్లి ట్రెడిషనల్‌గా చీర కట్టుకోమని చెప్పిందని, అయితే తాను మాత్రం రెడీమేడ్ సారీతో ఆ పని చాలా ఈజీగా చేశానని వీడియోలో తెలిపింది. ఇక […]

మరీ ఇంత చిరాకా.. కియారా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 01, 2019 | 11:38 AM

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెగ చిరాకు పడుతోంది. తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్న ఈ ఆధునిక రోజుల్లో తనకు నచ్చిన విధంగానే తానుంటానని పేర్కొంటూ తానే స్వయంగా తన జుట్టును కత్తిరించుకుంది.

జుట్టు కత్తిరించుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కియారా. తన కజిన్ మ్యారేజ్‌కి వెళ్లేటప్పుడు తన తల్లి ట్రెడిషనల్‌గా చీర కట్టుకోమని చెప్పిందని, అయితే తాను మాత్రం రెడీమేడ్ సారీతో ఆ పని చాలా ఈజీగా చేశానని వీడియోలో తెలిపింది.

ఇక బిజీ షెడ్యూల్స్‌తో క్షణం తీరిక లేని ఈ రోజుల్లో జుట్టు పెంచుకోవడం, దానికి మెరుగులు దిద్దడం వంటి పనులు చేసే ఓపిక తనకు లేదంది కియారా. అందుకే తను కత్తెరతో తన జుట్టును తానే కట్ చేసుకున్నట్లు తెలిపింది.

కియారా అద్వానీ హెయిర్ కట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మరీ అంత చిరాకు అయితే ఎలా కియారా..? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.