Viral Video: జింకపై మూడు చిరుతల దాడి.. వేటలో ముగింపు అద్భుతం.. మీరూ ఓ లుక్కేయండి.!

Cheetah Attack Deer: చిరుత ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. దాని వేగం, చాతుర్యం వేటాడేటప్పుడు క్షుణ్ణంగా కనిపిస్తాయి. అవి అప్పుడప్పుడూ...

Viral Video: జింకపై మూడు చిరుతల దాడి.. వేటలో ముగింపు అద్భుతం.. మీరూ ఓ లుక్కేయండి.!
Deer
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2021 | 2:41 PM

Cheetah Attack Deer: చిరుత ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. దాని వేగం, చాతుర్యం వేటాడేటప్పుడు క్షుణ్ణంగా కనిపిస్తాయి. అవి అప్పుడప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిరుత పులులు జింకపై ఒకేసారి దాడి చేస్తాయి. వాటి వేగాన్ని చూస్తే ఖచ్చితంగా జింకను రెప్పపాటులో వేటాడతాయని అనుకోవచ్చు. కానీ క్లైమాక్స్‌కు గేమ్ మొత్తం చేంజ్ అయింది. అదేంటో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

ఈ వీడియోలో, మూడు చిరుతలు ఒక జింకను చుట్టుముట్టాయి. వాటి నుంచి జింక బయటపడటానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి దాడి చేయడం ఆరంభించాయి. జింక పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఫలితం ఉండదు. ఆ జింకను మూడు చిరుతలు వేగంగా అనుసరిస్తాయి. ఇక కొంచెం దూరం వెళ్ళిన తరువాత, జింకను మరోసారి చిరుతలు చుట్టుముట్టాయి. అయితే ఈలోపే అవి అలిసిపోవడంతో జింక వేగంగా పరుగెత్తి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. ఈ వీడియోను లైఫ్ అండ్ నేచర్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. కొద్దిసేపటికి ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసి జనాలు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…