దేశంలోనే వింత రైల్వే స్టేషన్.! అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా కంపల్సరీ..
సాధారణంగా మనం విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు.. కచ్చితంగా వీసా ఉండాలి. లేదంటే ఆయా దేశాల్లో నో ఎంట్రీ. అయితే మన సొంత దేశంలో మాత్రం ఓ చోట నుంచి మరో ప్రాంతానికి ఎలాంటి వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. అయితే ఇండియాలోనే ఉన్న ఒక ప్రదేశానికి మాత్రం మీరు వెళ్లాలనుకుంటే.. మీ దగ్గర ఇండియా పాస్‌పోర్ట్, పాకిస్తాన్ వీసా కంపల్సరీ. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ఈ స్టోరీ చదివేసేయండి..

భారత్, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఏకైక ఇండియన్ రైల్వే స్టేషన్ అత్తారి(Attari). ఈ రైల్వే స్టేషన్‌కు ఎంతో వైవిధ్యమైన చరిత్ర ఉంది. ఇక్కడికి ఇండియన్స్ వెళ్లాలంటే.. పాకిస్తాన్ వీసా ఉండాల్సిందే. ఈ స్టేషన్ రెండు దేశాల బోర్డర్‌లో ఉండటం వల్ల ఎప్పుడూ భద్రతా దళాల పర్యవేక్షణలో ఉంటుంది. రెండు, మూడు దశల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా.. వీసా లేకుండా పట్టుబడితే.. అతడిపై విదేశీ చట్టం-14 కింద కేసు నమోదవుతుంది.
ఇదిలా ఉంటే.. భారత్, పాక్ మధ్య నడిచే సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను సైతం ఈ అత్తారి స్టేషన్ నుంచే జూలై 22, 1976 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక ఈ స్టేషన్ నుంచి ట్రైన్ టికెట్ కొనుగోలు చేసే ప్రతీ ప్రయాణికుడి దగ్గర నుంచి.. అతడి పాస్‌పోర్ట్ నెంబర్ తీసుకున్న తర్వాత.. వారికి బెర్ట్ కన్ఫర్మ్ చేస్తారు.
కాగా, ఈ స్టేషన్ నుంచి బయల్దేరిన రైలు ఒక్క క్షణం ఆలస్యమైనా.. ఆ వివరాలు భారత్, పాకిస్తాన్ రిజిస్టర్లలో నమోదవుతుంది. అలాగే ఇక్కడ ఫోటోలు తీయడం నిషేధం. అంతేకాకుండా పంజాబ్ పోలీసులు ఈ అత్తారి రైల్వేస్టేషన్‌కు కాపలాగా ఉంటారు.