Viral Video: డ్యాన్స్‌తో అదరగొట్టిన వధువు.. చివర్లో వరుడికి బిగ్ సర్‌ప్రైజ్.. చూస్తే మైమరిచిపోతారంటే!
పెళ్లంటేనే సరదా సరదాగా ఉంటుంది. కొన్ని పెళ్లిళ్లు సింపుల్‌గా జరిగితే.. మరికొన్ని పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి...
పెళ్లంటేనే సరదా సరదాగా ఉంటుంది. కొన్ని పెళ్లిళ్లు సింపుల్‌గా జరిగితే.. మరికొన్ని పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే పెళ్లిలో జరిగే ప్రతీ మూమెంట్.. ఓ ఫన్నీ మూమెంటే.. జీవితాంతం గుర్తిండిపోయే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ మధ్యకాలంలో చాలావరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. వధూవరులు తమకు నచ్చిన స్టైల్‌లో అన్నింటినీ నిర్ణయించుకుంటున్నారు. సంగీత్, మెహెందీ ఫంక్షన్లలో డ్యాన్స్‌లు ఇరగదీస్తున్నారు. తాజాగా ఓ యువతి తన పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియో ప్రకారం.. సబా కపూర్ అనే యువతి తన పెళ్లిలో డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. మండపానికి చేరుకోగానే తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ ఎనర్జీతో క్రేజీ డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ‘సా ఆస్‌మానోకో’ అనే బాలీవుడ్ పాటకు ఆమె వేసిన స్టెప్పులు వీక్షకులను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఇక డ్యాన్స్ అనంతరం చివర్లో ఆమె వరుడిని ఆశ్చర్యపరుస్తూ మోకరిల్లి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసింది.
View this post on Instagram
కాగా, యువతి సినిమాటిక్ ఎంట్రీ, డ్యాన్స్ మూవ్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘ఇలాంటి అమ్మాయి భార్యగా దొరకడం’ అతడి అదృష్టమంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘వాట్ ఏ క్యూట్ సీన్’ అంటూ మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
Also Read: Viral Photo: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. కనిపెడితే మీరు జీనియస్ అన్నట్లే.!