Viral News: వీడెవడో గానీ నిజంగా ఉత్తమ దొంగే.. పూలకుండీని దొంగించాడు.. ఆపై ఓ లెటర్ రాసి, డబ్బులు పెట్టి..
Viral News: ప్రపంచంలో చాలా రకాల దొంగలు ఉంటారు. కొందరు దొంగలు విచిత్ర దొంగతనాలు చేస్తుంటారు. మరికొందరు బద్దకస్తులైన దొంగలు..
Viral News: ప్రపంచంలో చాలా రకాల దొంగలు ఉంటారు. కొందరు దొంగలు విచిత్ర దొంగతనాలు చేస్తుంటారు. మరికొందరు బద్దకస్తులైన దొంగలు కూడా ఉంటారు. ఇలా దోపిడీ ఘటనలు కోకొల్లుగా చూసుంటాం. అప్పట్లో.. ఓ సోమరిపోతు దొంగ దొంగతనానికి వెళ్లి ఆ ఇంట్లో ఆహారాన్ని కడుపునిండా తిని పడుకున్న ఘనట కూడా హల్ చల్ చేసింది. తాజాగా మరో వింత దొంగతనం వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ దొంగతనం యూకే లోని కార్న్‌వాల్‌లో చోటు చేసుకుంది. అయితే ఈ దొంగ చాలా దయగల దొంగలా తెలుస్తోంది. దొంగిలించిన వస్తువుకు డబ్బులు కూడా చెల్లించాడు. అంతేకాదు.. ఓ లేఖను కూడా వదిలి వెళ్లిన దొంగ.. ఆ లేఖలో హృదయానికి హత్తుకునే మ్యాటర్ రాశారు.
కార్న్‌వాల్‌లో 80 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆ మహిళ ఇంట్లో ఒక అందమైన పూల కుండీ ఉంది. అయితే, మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా.. కొందరు దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి గది బయట ఉంచిన పూల కుండీని ఎత్తుకెళ్లారు. అయితే, కుండీని దొంగిలించిన దుండగులు.. దానికి ఎంత ధర అవుతుందో అంత సొమ్మును అక్కడ పెట్టారు. అలాగే ఓ లేఖను కూడా అక్కడ రాసి పెట్టారు. 15 యూరోలు(1,300 రూపాయలు), లేఖను పెట్టిన దొంగలు.. పూలకుండి తమకు బాగా నచ్చిందని, ఇది మాకు కావాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టాలనుకోవడం లేదని, ఈ పూలకుండీ తమకు బాగా ఆకట్టుకుందని లేఖలో తెలిపారు. అయితే, దొంగలు రాసిన లేఖను, డబ్బును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వార్త కాస్తా వైరల్‌గా మారింది. వీరు నిజంగా మంచి దొంగలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also read:
Yes Bank: గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన యెస్ బ్యాంక్.. ఎంత తగ్గించిందంటే..?
Konda Polam: ఫుల్ స్వింగ్‌లో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్ ‘కొండపోలం’ ప్రమోషన్స్..