Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yes Bank: గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన యెస్ బ్యాంక్.. ఎంత తగ్గించిందంటే..?

Yes Bank: యెస్‌ బ్యాంక్‌ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 2.25 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి

Yes Bank: గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన యెస్ బ్యాంక్.. ఎంత తగ్గించిందంటే..?
Home Loans Interest Rates
Follow us
uppula Raju

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 02, 2021 | 6:21 AM

Yes Bank: యెస్‌ బ్యాంక్‌ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 2.25 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే. ఈ సమయంలో గృహ రుణం 6.7 శాతం చొప్పున అందుబాటులో ఉంటుందని పేర్కొంది. జీతం తీసుకునే మహిళ రుణం తీసుకుంటే వడ్డీ రేటు 6.65 శాతం నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. యెస్ బ్యాంక్ ఈ పండుగ ఆఫర్ డిసెంబర్ 31, 2021 వరకు ఉంటుంది. ఈ త్రైమాసికంలో గృహ రుణాలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ కింద మీరు 35 సంవత్సరాల వరకు హోం లోన్ తీసుకునే అవకాశం ఉంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలు కూడా మినహాయిస్తారు. మీ లోన్ ఇప్పటికే రన్ అవుతుంటే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ని పొందవచ్చు.

గృహ రుణ కాలపరిమితి 35 సంవత్సరాలు యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. కస్టమర్లు తక్కువ వడ్డీకే ఇల్లు కొనుగోలు చేయడానికి ఈ ఆఫర్‌ని ప్రకటించామని తెలిపారు. 35 సంవత్సరాల వరకు గృహ రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పించింది. EMI భారాన్ని మరింత తగ్గించింది. ఇది కాకుండా ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సహాయంతో ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు.

గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా మెరుగుపడింది. ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ పెరిగింది. ఈ పండుగ సీజన్‌లో గృహాల విక్రయంలో విపరీతమైన బూమ్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే గృహ రుణాలు తీసుకునే వారు పెరుగుతారని యెస్‌ బ్యాంక్‌ ఆశిస్తోంది. ఇప్పటి వరకు గృహ రుణాల కోసం బ్యాంక్ కనీస వడ్డీ రేటు 8.95 శాతం ఉంది. గరిష్ట వడ్డీ రేటు 11.80 శాతం. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 2% లేదా కనీసం ఏది ఎక్కువ అయితే అది ఉంటుంది.

Shocking News: పెళ్లై 10 రోజులే అయ్యింది.. వధువు 8 నెలల గర్భవతి.. విషయం తెలిసి గిర్రున తిరిగిపడ్డ వరుడు..

Tata Micro SUV Punch: అక్టోబరు అక్టోబర్ 4 నుంచి టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్‌ కారు బుకింగ్స్

Namami Gange: నమామి గంగే చిహ్నంగా ‘చాచా చౌదరి’.. పిల్లలకు అవగాహన కల్పించడానికి ఎంపిక..