Sleep Job: ఏసీ గదిలో నిద్రపోవడమే ఉద్యోగం.. నెలకు రూ. 26 వేల జీతం.. షరతులు వర్తిస్తాయి..

నిద్రను ఎవరు కోరుకోరు.! ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతీ ఒక్కరూ కనీసం 7 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటారు. ఈ మధ్యకాలంలో..

Sleep Job: ఏసీ గదిలో నిద్రపోవడమే ఉద్యోగం.. నెలకు రూ. 26 వేల జీతం.. షరతులు వర్తిస్తాయి..
Sleep
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 23, 2022 | 9:19 PM

నిద్రను ఎవరు కోరుకోరు.! ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతీ ఒక్కరూ కనీసం 7 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటారు. ఈ మధ్యకాలంలో యువతకు నిద్ర కరువైంది. అయితే ఆ నిద్రే ఇప్పుడు మీకు డబ్బులు తెచ్చిపెడుతుంది. అవునండీ.! మీరు విన్నది నిజమే.. నిద్రపోతే చాలు ప్రతీ నెలా మీకు జీతం వచ్చేస్తుంది. ఆ జాబ్ కథేంటో ఇప్పుడు చూద్దాం..

జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం..  ఈ ఉద్యోగాన్ని మలేషియన్ యూనివర్సిటీ అందిస్తోంది. అక్కడ కొంతమంది పరిశోధకులు ఓ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు. దానిలో భాగంగా వారు నిద్రా విధానాలను తెలుసుకోవాలి. సో ఈ జాబ్‌కు అప్లై చేసుకునే అభ్యర్ధులు కేవలం నిద్రపోతే చాలు.. నెలకు రూ. 26,500 జీతం(భారత కరెన్సీలో) అందుతుంది.

దరఖాస్తు చేసుకునేవారికి కొన్ని షరతులు..

ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టర్‌ను విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అందులో అన్ని వివరాలను పేర్కొంటూ.. అభ్యర్ధుల వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. అలాగే దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు నిద్ర రుగ్మతులు ఉండకూడదు.

ఈ పరిశోధన గురించి మరింత సమాచారాన్ని అందిస్తూ.. అధ్యయనం చేస్తోన్న మిస్ సఫా అనే పరిశోధకురాలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహిస్తామని.. అలాగే పలు టెస్టులు కూడా చేస్తామని.. అవన్నింటిలోనూ క్వాలిఫై అయినవారిని మాత్రమే స్లీపింగ్ హోం(Sleeping Home)లోకి అనుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, ఎంపికైన వ్యక్తులకు సకల సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, ఈ ప్రకటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జనాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అంతే.! క్షణాల్లో రిజిస్ట్రేషన్‌ క్లోజ్ అయింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే