AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్కూళ్లలో చదువు కలలో కూడా సాధ్యం కాదేమో.! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాలలు.. ఏడాది ఫీజు తెలిస్తే ఫ్యూజులవుట్‌..

ప్రస్తుతం చదువును కొనే పరిస్థితిలోకి వెళ్లిపోయాము. కార్పొరేట్‌ పాఠశాలలు ఎల్‌కేజీకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రతీ ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో 'ప్రైవేటు పాఠశాలలో ఫీజులపై ప్రభుత్వం ఉక్కుపాదం' అనే వార్తలు..

ఈ స్కూళ్లలో చదువు కలలో కూడా సాధ్యం కాదేమో.! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాలలు.. ఏడాది ఫీజు తెలిస్తే ఫ్యూజులవుట్‌..
Expensive Schools
Narender Vaitla
|

Updated on: Feb 27, 2023 | 3:15 PM

Share

ప్రస్తుతం చదువును కొనే పరిస్థితిలోకి వెళ్లిపోయాము. కార్పొరేట్‌ పాఠశాలలు ఎల్‌కేజీకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రతీ ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో ‘ప్రైవేటు పాఠశాలలో ఫీజులపై ప్రభుత్వం ఉక్కుపాదం’ అనే వార్తలు చూస్తూనే ఉంటాయి. చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లల్ని మంచి స్కూళ్లలో చదించాలని కోరుకుంటారు. ఫీజులు ఎంతైనా భరించడానికి సిద్ధమవువతారు.

మీకు తెలిసినంత వరకు ప్రైవేటు పాఠశాలల ఫీజులు ఎంతలా ఉంటాయి.? మహా అయితే ఓ రూ. లక్ష అంటారా.? అదే.. పాఠశాల ఫీజు కోటి రూపాయలు అయితే.. ఊహించుకోవడానికి కూడా నమ్మశక్యంగా లేదు కదూ! కానీ నిజమే.. కోటికి పైగా వార్సిక ఫీజులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అలాంటి కొన్ని స్కూల్స్‌పై ఓ లుక్కేయండి..

బ్యూ సోలీల్ ఆల్పైన్ కాలేజ్..

ఈ పాఠశాల స్విట్జర్లాండ్‌లో ఉంది. ఈ స్కూల్‌లో సుమారు 300 మంది విద్యనభ్యసిస్తున్నారు. 50కి పైగా దేశాల నుంచి పిల్లలు తమ చదువుల కోసం ఈ పాఠశాలకు వస్తుంటారు. ఇక్కడ ఏడాది ఫీజు స్విట్జర్లాండ్‌ కరెన్సీలో 1,50,000 స్విస్‌ ఫ్రాంక్స్‌గా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 1.34 కోట్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

లే రోసీ ఇన్‌స్టిట్యూట్‌..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫీజున్న పాఠశాల్లో ఒకటైన లే రోసీ ఇన్‌స్టిట్యూట్‌ కూడా స్విట్జర్లాండ్‌లోనే ఉంది. ఇక్కడి సుమారు 65 దేశాల నుంచి చిన్నారులు విద్యనభ్యసించేందుకు వస్తుంటారు. ఈ పాఠశాలలో సుమారు 420 నుంచి 430 మంది విద్యార్థులు విద్యనభిస్తున్నారు. ఇక ఈ స్కూల్‌లో విద్యనభ్యసించాలంటే ఏడాదికి రూ. 1.1 కోట్లు చెల్లించాల్సిందే.

హర్ట్‌వుడ్ హౌస్ స్కూల్, సర్రే, UK..

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులు చేరాలంటే ఇంటర్వ్యూను క్లియర్‌ చేయాల్సిందే. ఈ స్కూల్‌లో చిన్నారులను చదివించాలంటే ఏడాదికి రూ. 25 లక్షలు చెల్లించాల్సిందే.

థింక్‌ గ్లోబల్ స్కూల్‌..

అమెరికాలో ఉందీ ఖరీరైదన పాఠశాల. ఈ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులను ప్రపంచంలోని నాలుగు దేశాల్లో తిప్పుతుంటారు. ఆయా దేశాల్లో విద్యను అభ్యసిస్తుంటారు. ఇక ఈ స్కూల్‌లో చిన్నారులను చేర్పించాలంటే ఏడాదికి రూ. 77 లక్షలు చెల్లించాల్సిందే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us