Viral Video: బాబోయ్.. ఏంటది అలా ఉంది.. టీవీ చూసి షాకైన చిన్నారి.. వీడియో వైరల్..
చిన్నారులు చేసే అల్లరి పనులు.. వారి ఎక్స్ప్రెషన్స్ ఎంతో ముచ్చటేస్తుంటాయి. కుటుంబసభ్యులు.. ఇంట్లో పెంచుకునే జంతువులతో
చిన్నారులు చేసే అల్లరి పనులు.. వారి ఎక్స్ప్రెషన్స్ ఎంతో ముచ్చటేస్తుంటాయి. కుటుంబసభ్యులు.. ఇంట్లో పెంచుకునే జంతువులతో కలిసి చిన్నపిల్లలు ఆడే అల్లరి ఆటలు ఆకట్టుకుంటాయి. వారికి తెలియని విషయం గురించి తెలుసుకున్నప్పుడు.. లేదా ఏదైనా కొత్త వస్తువులు.. జంతువులను చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటారు. అలా ఓ చిన్నారి టీవీ చూస్తూ షాకైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంట్లో ఆడుకుంటూ ఆకస్మాత్తుగా టీవీ చూస్తూ షాకైంది ఆ చిన్నారి. ఇంతకీ టీవీలో ఏం చూసింది..ఎందుకు అంతగా ఆశ్చర్యపోయిందో తెలుసుకుందామా. 2 ఏళ్ల చిన్నారి తన ఇంట్లో ఆడుకుంటూ టీవీ చూస్తుంది. అందులో ఓ హాలీవుడ్ మూవీ ప్లే అవుతుంది. అయితే ఆకస్మాత్తుగా అందులో ఓ డైనోసర్ రావడం ఆ చిన్నారి చూసింది. దీంతో ఒక్కసారిగా షాకైంది.
ఆ డైనోసార్‌ను చూస్తూ ఆ చిన్నారి తన చేతులను నోటికి అడ్డుపెట్టుకుని ఆశ్చర్యపోయింది. మొట్టమొదటి సారి డైనోసర్ వీడియో చూసి షాక్‌తో నిలబడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెడిట్ అనే వెబ్ సైట్ లో షేర్ చేస్తూ.. “నా రెండేళ్ల కూతురు మొదటిసారి డైనోసర్‌ను చూసింది ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. చిన్నారి ఎక్స్ప్రెషన్స్ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు.
Also Read: Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..
Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..