Viral Video: కారు వేగంగా వెళ్తుండగా బానట్‌పై పడిన పాము.. బిత్తర పోయిన డ్రైవర్.. ఏం చేశాడంటే..
అకస్మాత్తుగా ఆ కారు బోనెట్‌పై పాము కనిపించింది. ఈ వీడియోను కారు లోపల కూర్చున్న జంట చిత్రీకరించారు. ఇది జరిగిన వెంటనే కారులో ప్రయాణిస్తున్న..
ఈ రోజంతా మీ రోజే కావాలంటే సోషల్ మీడియాకు వెల్లండి. అందులో వచ్చే వీడియోలను చూస్తూ సరదాగా గడిపేయండి. అందులో కొన్నిసార్లు సరదా.. సరదా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలోని కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. అలాంటి వీడియో యూట్యూబ్ వేదికగా వైరల్ అవుతోంది. దీనిలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారుపైకి ఒక్కసారిగా పాము దూకింది. అకస్మాత్తుగా ఆ కారు బోనెట్‌పై పాము కనిపించింది. ఈ వీడియోను కారు లోపల కూర్చున్న జంట చిత్రీకరించారు. ఇది జరిగిన వెంటనే కారులో ప్రయాణిస్తున్న జంట కూడా భయందోళనకు గురైంది. ఈ వీడియోను చూసిన యూజర్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
వాస్తవానికి, ఈ వీడియో YouTubeలో వైరల్ హాగ్ పేజీలో భాగస్వామ్యం చేయబడింది. అయితే, ఈ వీడియో ఎక్కడ నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటి నుండి జనం హడలి పోతున్నారు. కారు అధిక వేగం కారణంగా పాము కిందికి జారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారు తమ కామెంట్స్‌ను జోడిస్తున్నారు.
వీడియోను చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. అమ్మో ఎంత ప్రమాదం తప్పింది. అంటూ ఒకటరు కామెంట్ చేస్తే.. కారు నెమ్మదిగా వెళ్తే కారులోకి పాము వచ్చే ఛాన్స్ ఉందని మరొకరు స్పందించారు.
ఇవి కూడా చదవండి: Priyanka Gandhi: నన్ను ఎందుకు నిర్బంధించారో చెప్పండి.. ప్రధాని మోడీని ప్రశ్నించిన ప్రియాంక..