Shimron Hetmyer: మ్యాచ్ గెలిపించానోచ్.. బ్రావో భుజాలపైకి ఎక్కి సంతోషాన్ని పంచుకున్న హెట్‌మేయిర్.. వైరలవుతోన్న వీడియో
పంత్ పుట్టినరోజు నాడు ఆడిన మ్యాచులో డీసీ 100 వ విజయాన్ని నమోదుచేసుకుంది. ఈ మ్యాచులో మరో విశేషం ఏంటంటే పృథ్వీ షాకు తన 50 వ మ్యాచు ఆడాడు. అలాగే ఐపీఎల్ 2021లో ఈ మ్యాచ్ 50 వ మ్యాచ్‌గా జరిగింది.
IPL 2021 DC vs CSK: నంబర్ వన్ స్థానం కోసం పోటీపడిన చెన్నై సూపర్ కింగ్స్ టీం ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానం కూడా పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 13వ మ్యాచుల్లో 10 విజయం సాధించి, 20 పాయింట్లతో అగ్రస్థానం చేరుకుంది. తొలత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం కేవలం 137 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది. అనంతరం ఢిల్లీ టీంలో శిఖర్ ధావన్‌కు తోడు హెట్ మేయిర్ రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నంబర్ వన్ టీంగా మారింది. అయితే ఈ మ్యాచులో హెట్ మేయిర్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుని ఢిల్లీని నంబర్ వన్ స్థానంలో నిలిపాడు. టాప్ ఆర్డర్ విఫలమైనా.. లోయర్ ఆర్డర్‌లో నేనున్నానంటూ భరోసా కల్పించాడు. అలాగే విజయం అనంతరం తన ప్రత్యర్థి టీంలో ఆడుతోన్న డ్వేన్ బ్రావోను వెనుకనుంచి భుజాలపైకి ఎక్కి తన సంతోషాన్ని పంచుకున్నాడు. దానికి బ్రావో కూడా హెట్‌మేయిర్‌ను తన భుజాలపై మోస్తూ కొద్దిసేపు సందడి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది. ఈ ఇద్దరూ వెస్టిండీస్ ప్లేయర్లే కావడంతో తన ఆనందాన్ని బ్రావోతో పంచుకున్నాడు.
రిషబ్ పంత్ పుట్టినరోజు నాడు ఆడిన మ్యాచులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 100 వ విజయాన్ని నమోదుచేసుకుంది. ఈ మ్యాచులో మరో విశేషం ఏంటంటే పృథ్వీ షాకు తన 50 వ మ్యాచు ఆడాడు. అలాగే ఐపీఎల్ 2021లో ఈ మ్యాచ్ 50 వ మ్యాచ్‌గా జరిగింది.
50 వ మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా మరోసారి నిరాశపరిచాడు. తొలుత బౌండరీలతో చెన్నై బౌలర్ల దుమ్ముతులిపినా.. ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఆకట్టుకోలేక పోయాడు. పంత్ కూడా అతిథి పాత్రలా వచ్చి పోయాడు. షిమ్రాన్ హెట్‌మైర్ 18 బంతుల్లో28 పరుగులతో (2×4, 1×6) చెన్నైని ఓడించాడు.
Nail-biting finish! ? ?@DelhiCapitals hold their nerve & beat #CSK by 3⃣ wickets in a last-over thriller. ? ? #VIVOIPL #DCvCSK
Scorecard ? https://t.co/zT4bLrDCcl pic.twitter.com/ZJ4mPDaIAh
— IndianPremierLeague (@IPL) October 4, 2021
T20 World Cup, IND vs PAK: భారత్ అంత బలంగా లేదు.. ఈ సారి పాకిస్తాన్‌దే విజయం: పాక్ మాజీ ప్లేయర్