Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వేడివేడి కాఫీని హుషారుగా తాగాలనుకున్నాడు.. తీరా ఆర్డర్ చేయగానే..

స్టార్‌బక్స్ కంపెనీకి 50 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ. 415 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా.. కాఫీ ఒలికిపోవడం వల్ల తన జననాంగాలకు గాయం అయిందని.. 2020లో దావా వేశాడు సదరు కస్టమర్.

Viral: వేడివేడి కాఫీని హుషారుగా తాగాలనుకున్నాడు.. తీరా ఆర్డర్ చేయగానే..
Coffee
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 17, 2025 | 11:53 AM

కొన్నిసార్లు తెలియకుండా చేసే చిన్న తప్పుతో పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సామెతకు సరిగ్గా అడ్డం పట్టే విధంగా ఈ ఘటన జరిగింది. స్టార్‌బక్స్ కాఫీ కంపెనీ తెలియకుండా చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అవును.! మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి తొడపై వేడివేడి స్టార్‌బక్స్ కాఫీ పడటంతో.. అతడికి 50 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ.415 కోట్లు) బహుమతిగా ఇచ్చింది. కాఫీ మూతను సరిగ్గా క్లోజ్ చేయకుండా కస్టమర్‌కు ఇవ్వడంతో.. ఆ వేడివేడి కాఫీ.. సదరు కస్టమర్ వ్యక్తి తొడపై పడింది. తద్వారా అతడి జననాంగాలకు గాయమైంది. దీనిపై అతడు 2020లో కోర్టుకు వెళ్లగా.. స్టార్‌బక్స్‌కు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో జరిగింది. వేడివేడి స్టార్‌బక్స్ కాఫీ తొడపై పడటంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తితన పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించగా.. స్టార్‌బక్స్ 50 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.415 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

వేడివేడి కాఫీ తన తొడపై పడటంతో.. అతడి జననాంగాలకు తీవ్ర గాయమైందని.. స్టార్‌బక్స్ సంస్థ తనకు కాఫీ ఇచ్చేటప్పుడు మూత సరిగ్గా క్లోజ్ చేయకుండా ఇచ్చారని.. తద్వారా తనకు గాయం అయిందని అన్నాడు. ఆ క్రమంలోనే దీనిపై 2020లో కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో దావా వేశాడు. మీడియా నివేదికల ప్రకారం, సదరు వ్యక్తి న్యాయవాది మైఖేల్ పార్కర్.. స్టార్‌బక్స్ తన క్లయింట్ ఆర్డర్ చేసిన కాఫీ డెలివరీ చేసినప్పుడు దాని మూతను సరిగ్గా క్లోజ్ చేయలేదని ఆరోపించాడు. దీని వల్ల తన క్లయింట్‌పై వేడి కాఫీ పడిందని చెప్పాడు. ఈ ఘటన తర్వాత అతడు శారీరక బాధను మాత్రమే కాకుండా మానసిక వేదన కూడా అనుభవించాడని కస్టమర్ తరపు న్యాయవాది వాదించాడు. వాదోపవాదనలు విన్న కోర్టు.. ఇటీవలే తుది తీర్పును ఇచ్చింది. స్టార్‌బక్స్ సంస్థ బాధితుడికి 50 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

కంపెనీ ఏం చెబుతోంది.?

కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని స్టార్‌బక్స్ తెలిపింది. “మేము సదరు కస్టమర్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ ప్రమాదానికి మేము బాధ్యులమని జ్యూరీ ఇచ్చిన తీర్పుతో మేము విభేదిస్తున్నాం. పరిహారం మొత్తం చాలా ఎక్కువగా ఉందని మేము భావిస్తున్నాం. కంపెనీ ఎల్లప్పుడూ తమ కాఫీ షాప్‌లలో వేడివేడి కాఫీని అందించడమే కాదు.. అత్యున్నత భద్రతా ప్రమాణాలను కూడా పాటిస్తుంది” అని స్టార్‌బక్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!