అరటి పండ్లు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే ఇవి సులభంగా జీర్ణమవుతాయి కనుక వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది
TV9 Telugu
ఉదయం బ్రేక్ ఫాస్ట్, జిమ్ చేసిన తరువాత అరటి పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. అయితే కొంత మంది అరటిపండును నేరుగా తినడానికి ఇష్టపడరు. వీటితో బనానా షేక్ వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు
TV9 Telugu
నిజానికి అరటిపండును ఏ రూపంలో తీసుకోవాలో వ్యక్తి శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారు అరటిపండును నేరుగా తీసుకోవడం మంచిది
TV9 Telugu
భారీ వ్యాయామాలు చేసేవారు అరటిపండును మిల్క్ షేక్ రూపంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారమైతే అరటిపండును నమలి తినడం మంచిదని చెబుతున్నారు
TV9 Telugu
అరటిపండును నమలడం వల్ల లాలాజలంలో ఉండే సమ్మేళనాలు సక్రియం చేయబడతాయి. దీంతో జీర్ణక్రియ సులభతరం అవుతుంది
TV9 Telugu
అరటిపండును నమలడం వల్ల దానిలో ఉండే మొత్తం పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. అరటిపండుతో స్మూతీ, షేక్ వంటివి చేసి తీసుకోవడం వల్ల దానిని నమలాల్సిన అవసరం లేదు
TV9 Telugu
అరటిపండును పాలతో కలిపి మిక్స్ చేసి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో కఫం పెరుగుతుంది. ఇది సైనస్, జలుబు, అలర్జీ వంటి వాటికి దారి తీస్తుంది
TV9 Telugu
బనానా షేక్ పొట్టలోకి చేరిన తరువాత అరటిపండులో ఉండే మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు పాలతో కలిసి పెరుగుగా మారుతుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. బనానా