Viral Video: నన్నే డిస్ట్రబ్ చేస్తారా? పక్షులకు సుస్సు పోయించిన ఉడుత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు భయ్యా..!
Viral Video: పిట్ట కొంచెం కూత ఘనం అని ఇప్పటి వరకు విన్నాం.. కానీ, ఇకనుంచి కొత్త పదం కూడా వినాల్సిందే. ఉడుత కొంచె.. దాని బెదిరింపులు ఘనం.
Viral Video: పిట్ట కొంచెం కూత ఘనం అని ఇప్పటి వరకు విన్నాం.. కానీ, ఇకనుంచి కొత్త పదం కూడా వినాల్సిందే. ఉడుత కొంచె.. దాని బెదిరింపులు ఘనం. అవును.. తనను డిస్ట్రబ్ చేస్తున్న పక్షులను భయపెట్టే ప్రయత్నం చేసింది ఉడుత. మామూలుగా కాదు.. గాంఢ్రింపుతో వాటిని హడలెత్తించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను @buitengebieden పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో ఓ ఉడుత సంరక్షిత ప్రాంతంలో హాయిగా కూర్చుంది. ఇంతలో కొన్ని పక్షులు శబ్ధాలు చేస్తున్నాయి. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఉడుత.. ఆ పక్షులు శబద్ధాలు చేయడంతో డిస్ట్రబ్ అయ్యింది. దాని కోపం నశాలానికంటింది. ఇంకేముందు.. ఆ పక్షులను బెదిరించే ప్రయత్నం చేసింది. తన చిన్ని గొంతుతోనే గాంఢ్రిస్తూ వాటిని భయపెట్టేందుకు ట్రై చేసింది. అయితే, దాని గొంత కనీసం కూతవేటు దూరం కూడా వినిపించని పరిస్థితి ఉంది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ.. ఆ ఉడుత పక్షులను భయపెట్టేందుకు గట్టిగానే ట్రై చేసింది. ఈ ఉడుత అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దాని చర్యకు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో 20 వేలక పైగా లైక్స్ వచ్చాయి.
Squirrel trying to scare off a bird..
Sound on.. pic.twitter.com/s2YQFGlWih
— Buitengebieden (@buitengebieden) August 9, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..