SpiceJet Air Hostess: అలియా భట్ ధోలిడా పాటకు డ్యాన్స్ చేసిన స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్.. నెటిజన్లు ఫిదా..
SpiceJet Air Hostess: సోషల్ మీడియా(Social Media), ఇంటర్నెట్(Internet) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రీల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి...
SpiceJet Air Hostess: సోషల్ మీడియా(Social Media), ఇంటర్నెట్(Internet) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రీల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ పుష్ప సాంగ్స్ తో పాటు అలియా భట్ నటించిన గంగూబాయి సినిమాలోని ధోలిడా సాంగ్ కూడా బాగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి విమానంలోని క్యాబిన్ లోపల ఓ సాంగ్ కు స్టెప్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది,
ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి తన డ్యాన్స్ వీడియోలతో హృదయాలను గెలుచుకుంది. అంతేకాదు ఉల్లాసంగా, బబ్లీగా ఉండే ఆమె ఇంటర్నెట్ లో ఓ చిన్న సెలబ్రెటీ గా మారింది. తాజాగా ఉమా అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమాలోని ధోలిడా పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
ఉమా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ నెటిజన్ల హృదయాలను దోచుకుంది. ఉమా ఎయిర్ హోస్టెస్ యూనిఫాం ధరించి గంగూబాయి కతియావాడిలోని పాటకు ఆమె డ్యాన్స్ చేసింది.. ఉమ హుక్ స్టెప్‌ను చక్కగా నెయిల్స్ చేసింది.. వీడియో చివరిలో ఉమ మెస్మరైజ్ చేస్తూ.. మధురంగా ఓ చిన్న చిరునవ్వు నవ్వి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
View this post on Instagram
ఈ వీడియో 2 మిలియన్లకు పైగా వ్యూస్ ను వేల సంఖ్యలో కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఈ ధోలిడా సాంగ్ ను కుమార్ రాయగా. జాన్వీ శ్రీమాన్కర్ , శైల్ హడా పాడారు. సంజయ్ లీలా భన్సాలీ స్వరపరిచారు రాశారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: