Bears in Function: రిసెప్షన్ వేడుకకు అనుకోని అతిథి.. కుటుంబ సమేతంగా ఎలుగుబంటి హాజరు..

Bears in Function: పెళ్ళి(Wedding) అంటే వధూవరుల ఫ్యామిలీ సభ్యులతో పాటు స్నేహితులు, చుట్టాలు, భాజాలు భజంత్రీలతో సందడి నెలకొంటుంది. అయితే పెళ్లి  రిసెప్షన్ వేడుకకి..

Bears in Function: రిసెప్షన్ వేడుకకు అనుకోని అతిథి.. కుటుంబ సమేతంగా ఎలుగుబంటి హాజరు..
Bears At Function
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2022 | 3:41 PM

Bears in Function: పెళ్ళి(Wedding) అంటే వధూవరుల ఫ్యామిలీ సభ్యులతో పాటు స్నేహితులు, చుట్టాలు, భాజాలు భజంత్రీలతో సందడి నెలకొంటుంది. అయితే పెళ్లి  రిసెప్షన్ వేడుకకి అనుకోని అతిధిగా ఎలుగుబంటి వస్తే.. ఈ వింత ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌ వేడుకకి ఊహించని అతిథి కుటుంబ సమేతంగా ఎంట్రీ ఇచ్చింది. అయితే కాస్త ఆలస్యంగా రావడంతో పాపం వెనుదిరిగి వెళ్లిపోయింది. కంకేర్ జిల్లాలో ఒక మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరిగింది. వేడుక అనంతరం వధువరులతోపాటు, ఆహ్వానితులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతలో ఒక ఎలుగుబంటి తన పిల్లలను వెంటపెట్టుకొని ఆ ఫంక్షన్‌ హాల్‌కి వచ్చింది. రిసెప్షన్‌ వేదిక పైకి వెళ్లింది. అక్కడ వాసన చూసి అటు ఇటు తిరిగింది. కొంత సేపటి తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో ఆ ఫంక్షన్‌ హాల్‌ వేదికపై ఎవరూ లేకపోవడంతో ఆ ఎలుగుబంటి వల్ల ఎవరికీ ఎలాంటి ముప్పు కలగలేదు. అయితే ఆ సమయంలో ఫంక్షన్‌ హాల్ వద్ద ఉన్న సిబ్బంది ఎలుగుబంటి రాకను గమనించారు. ఒక వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో దీనిని రికార్డు చేశాడు. అది ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా వెళ్లిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా పలు కామెంట్లు చేశారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్ కస్వాన్ కూడా వీడియోను షేర్‌ చేస్తూ.. ‘బహుశా.. విందు ఏర్పాట్లు వాటికి నచ్చలేదు అనుకుంటా’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూస్తున్న నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

నిరుద్యోగులకు టెక్‌ మహీంద్రా బంపరాఫర్‌.. పక్కా జాబ్‌ పొందే కోర్సులో ఉచితంగా శిక్షణ.