Viral News: వరి నాట్లు వేయడానికి వచ్చిన రైతుకు ఊహించని షాక్.. కనిపించిన దృశ్యానికి ఫ్యూజులు ఔట్.!
Viral News: ఆ పొలంలో రోజూలాగే వరి నాట్లు వేయడానికి కూలీలు వచ్చారు. తమ పనిలోకి దిగుదామనుకున్న వారు.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా..
ఆ పొలంలో రోజూలాగే వరి నాట్లు వేయడానికి కూలీలు వచ్చారు. తమ పనిలోకి దిగుదామనుకున్న వారు.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎక్కడ చూసినా గుట్టలు.. గుట్టలుగా పాములు కనిపించాయి. దీనితో వారి ఫ్యూజులు ఔట్ అయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
సాధారణంగా చీమలు గుంపులు, గుంపులుగా రావడం చూసి ఉంటాం. అయితే పాములు గుంపులు, గుంపులుగా ఉండటం ఎక్కడైనా చూశారా.? ఇలాంటి దృశ్యం తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని గుర్రబ్బాడు గ్రామంలో చోటు చేసుకుంది. గుర్రబ్బాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు తన పొలంలో వరి నారు వేశాడు. పురుగు పుట్రా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త కోసం థిమ్మెట్ ద్రావణం పిచికారీ చేసి అందులో నీళ్లు నింపాడు. ఇక రెండు రోజుల తర్వాత పొలం వద్దకు వెళ్లి చూడగా వరిమడిలో కొన్ని పాములు చచ్చిపోయి నీటిలో తేలియాడుతూ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన రామాంజనేయులు ఇంకా ఏమైనా పాములు ఉన్నాయేమోనన్న అనుమానంతో మడిలోని నీటిని బయటికి తోడాడు. అతడు ఊహించినట్లుగానే చచ్చిన పాములతో పాటు మరికొన్ని బ్రతికున్న పాములు ఉన్నాయి. పొలంలో అడుగుపెడితే ఎక్కడ కాటు వేస్తాయోనని గ్రహించి మెల్లగా కర్ర సహాయంతో వాటిని ఒక్కొక్కటిగా బయటకు బ్రతికి ఉన్న వాటిని కూడా చంపేశాడు.
కాగా, ఈ విషయంపై రామాంజనేయులు మాట్లాడుతూ.. ”పొలాల్లో పాములు ఉండడం సహజం.. కానీ ఒక్క మడిలోనే ఏకంగా డెబ్భై, ఎనభై పాములు చూడడం నా జీవితంలో ఇదే మొదటిసారి. నారుమడి వేయక ముందు పాములు వచ్చి చేరాయో లేక పక్కనే ఉన్న వంక నుండి వచ్చాయో కానీ పొలంలో తాము ముందే గుర్తించకపోయి ఉంటే తనతో పాటు కూలీలు కూడా పాము కాటుకు గురై ఉండేవాళ్లు” అని పేర్కొన్నాడు. అయినా పాములున్నాయని వ్యవసాయం వదులుకోలేం కదా అని రామాంజనేయులు చెప్పుకొచ్చాడు.
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్