అనంతపురం జిల్లా ఉరవకొండలో బైక్ లో దూరిన పాము. బైక్ యజమానిని ముప్పు తిప్పలు పెట్టింది. సాధారణంగా పాములను ముళ్ల పొదలలోనో, చెత్త కుప్పల్లోనో, పంట పొలాల వద్ద చూస్తూ ఉంటాం. కానీ ఆ పాముకు బైకు సీట్ కింద హ్యాపీ గా ఉంది. అదే క్షేమమనిపించిందో ఏమో తెలియదు… ఎక్కడి నుండి వచ్చిందో?? ఎపుడు దూరిందో?? కానీ బైక్ సీటు కింద దూరింది.. ఉరవకొండ పట్టణంలోని బ్రాహ్మణ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి తన బైకును ఇంటి ముందు నిలిపి లోపలికి వెళ్ళాడు . ఇక ఇంటికి వెళ్దామని బైక్ వద్దకు వచ్చి బైక్ స్టార్ట్ చేసాడు. అంతలోనే లైట్ వెలుతురులో సీటు కింద నుంచి వేలాడుతున్న పాము తోక మెరుస్తూ కనిపించింది. దీంతో ఖంగుతిన్న యజమాని హడలిపోయి బైకును వదిలేసి పక్కకు వెళ్ళాడు. బైక్ యజమాని ఎంత శబ్దం చేసినా పాము బయటకు రాకుండా సీటు కిందనే అలాగే ఉండిపోయింది.
చుట్టుపక్కల వారు అందరూ వచ్చి ఎంత ప్రయత్నించినా…. కదలను అంటూ అలాగే ఉండిపోయింది. ఎలాగోలా బైక్ సీటును తొలగించి ఓవైపు శబ్దం చేస్తూ..కర్రలతో కదిలించినా కూడా అది బయటికి వెళ్లకపోవడంతో పాము ఉన్నా… నెమ్మదిగా బైకును కాలనీ చివరి వరకు తోసికెళ్ళి క్రిందకు పడుకోబెట్టి నానా తిప్పలు పడి కర్రతో కదిలించడంతో మెల్లగా బైకు నుండి జారుకుని పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది… దీంతో బ్రతుకు జీవుడా అంటూ బైక్ తీసుకొని వెళ్లిపోయాడు ఆ వాహన యజమాని.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..