Viral Video: కేదార్ నాథ్‌లో అపచారం..! శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ.. అహంకారమా.. భక్తా..?

Viral Video: కేదార్ నాథ్‌లో అపచారం..! శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ.. అహంకారమా.. భక్తా..?

Anil kumar poka

|

Updated on: Jun 26, 2023 | 9:24 AM

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ధామ్ అంటే శివుడు పుణ్యక్షేత్రం.. పవిత్రమైన ప్రదేశం. అందులోనూ గర్భ గుడిలో కొలువైన శివయ్య దగ్గరకు వెళ్లేటప్పుడు ఎంతో భక్తితో వెళతారు భక్తులు. అలాంటి గర్భ గుడిలోని.. శివుడి.. శివ లింగంపై ఓ మహిళ తన దగ్గర ఉన్న డబ్బును వెదజల్లింది.

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ధామ్ అంటే శివుడు పుణ్యక్షేత్రం.. పవిత్రమైన ప్రదేశం. అందులోనూ గర్భ గుడిలో కొలువైన శివయ్య దగ్గరకు వెళ్లేటప్పుడు ఎంతో భక్తితో వెళతారు భక్తులు. అలాంటి గర్భ గుడిలోని.. శివుడి.. శివ లింగంపై ఓ మహిళ తన దగ్గర ఉన్న డబ్బును వెదజల్లింది. గర్భ గుడిలోని శివ లింగంపై నోట్లను విసిరింది.. గర్భ గుడిలో పైకి వెదజల్లింది. ఇదంతా కెమెరాలో రికార్డ్ కావటం.. అది సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం సంచలనంగా మారింది.

కేదార నాథ్ ఆలయం.. గర్భ గుడిలో ఈ మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 2023, జూన్ 19వ తేదీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. శివుడి ముందే కుప్పిగంతులా.. ఆమెకు ఎంత అహంకారం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ సమయంలో గర్భగుడిలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఆలయ పురోహితులు మంత్రాలు పఠిస్తూ కనిపించారు. మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న వారు అడ్డుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చేష్టలను ఆలయం నిర్వహకులు ఎలా అనుమతి ఇచ్చారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. శివుడు అంటే మోక్ష కారకుడు.. అలాంటి శివయ్యపైనే నోట్లతో అభిషేకం చేస్తుందా.. ఎంత అహంకారం ఉంటే ఇలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. డబ్బులు ఉంటే పేదలకు పంచి పెట్టొచ్చు.. అలా కాకుండా కేదార్ నాథ్ లోని గర్భ గుడిలోనే ఇలా నోట్లను వెదజల్లటం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. భక్తుల నుంచి వస్తున్న విమర్శలపై కేదార్ నాథ్ ఆలయం స్పందించింది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన సదరు మహిళపై విచారణ జరిపించాలని ఆలయ కమిటీ అధికారులు రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరారు. ఆ మహిళపై పోలీసులకు కంప్లయింట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..