Villagers Viral Game: మీ ఊళ్లో ఈ ఆట ఆడతారా..? గోల్ఫ్‌కాదు.. క్రికెట్ కాదు.. మరేంటి.?
పల్లెటూర్లల్లో రకరకాల ఆటలు ఆడుతుంటారు. అందులో కొన్ని ఆటలు చాలా మందికి తెలియవు. కర్రబిళ్ల, కోతికొమ్మచ్చి లాంటి ఆటలు ఎక్కువగా పల్లెటూళ్లోనే కనిపిస్తాయి. తాజాగా అదే కోవకు చెందిన ఓ ఆటకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పల్లెటూర్లల్లో రకరకాల ఆటలు ఆడుతుంటారు. అందులో కొన్ని ఆటలు చాలా మందికి తెలియవు. కర్రబిళ్ల, కోతికొమ్మచ్చి లాంటి ఆటలు ఎక్కువగా పల్లెటూళ్లోనే కనిపిస్తాయి. తాజాగా అదే కోవకు చెందిన ఓ ఆటకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎక్కడిదో తెలియదు కానీ.. చూడడానికి గోల్ఫ్‌లా ఉన్నా.. అది గోల్ఫ్ ఆటకాదు. బ్యాటుతో కొడుతున్నారు.. కానీ, అది క్రికెట్ కాదు. ఫుట్‌బాల్‌ను ఉపయోగిస్తున్నారు కానీ, అది ఆ ఆట కూడా కాదు. ఇంతకీ ఇదేం ఆట.!
ఈ ఆటకు సంబంధించిన వీడియోను ఆర్‌పీజీ గ్రూప్ సంస్థల అధినేత హర్ష్ గోయెంక ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ ఆట అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇంతకీ అందులో ఏముందంటే.. రెండు వైపులా కొంత దూరంలో ఒకదాని వెనుక మరొకటి వరుసగా సీసాలను పెట్టారు. వాటికి ఒక చివరన స్టీల్ చెంబులను నిలువుగా పేర్చారు. రెండో చివరన ఓ మహిళ ఫుట్‌బాల్‌ను రెండు గాజుసీసా వరుసల మధ్యనుంచి బ్యాటుతో కొట్టారు. అది నేరుగా ఎదురుగా ఉన్న స్టీల్ చెంబులను తాకాలి. ఎవరైతే అలా బంతిని తాకిస్తారో వాళ్లే విజేత. ఆ మహిళ కొడుతున్న సమయంలో ఇరువైపులా ఉన్న వారు ఆమెను ఉత్సాహపరుస్తున్నారు. ‘గోల్ఫ్, క్రికెట్, బౌలింగ్ ఏదైనా అనుకోండి కానీ, ఈ ఆట ఎంతో సరదాగా ఉంది ’ అంటూ గోయెంక ట్వీట్ చేశారు. దీనిపై పలువురు కామెంట్లు కురిపిస్తున్నారు. సూపర్‌గా ఉందంటూ కితాబిస్తున్నారు. ఇలాంటి ఆటలే ప్రజల్ని ఒక చోటకి చేర్చి.. ఆనందాన్ని పంచిపెడతాయని, పూర్వం ఇలాంటి ఆటల వల్లే ప్రజలు సంతోషంగా కలిసిమెలిసి ఉండేవారంటూ రాసుకొస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..