Viral Video: ప్రిన్సిపాల్ రాక్స్.. స్టూడెంట్ షాక్..! డ్యాన్స్ చేస్తూ స్టేజీపైకి వచ్చిందని ప్రిన్సిపాల్ చేసిందంటే.?
అమెరికాలోని ఓ పాఠశాలలో సర్టిఫికెట్‌ల ప్రధానోత్సవంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియా హైస్కూల్‌లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌ల ప్రధానోత్సవం జరిగింది. విద్యార్థులను ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి పిలుస్తూ సర్టిఫికెట్‌లు ప్రధానం చేస్తున్నారు.
అమెరికాలోని ఓ పాఠశాలలో సర్టిఫికెట్‌ల ప్రధానోత్సవంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియా హైస్కూల్‌లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌ల ప్రధానోత్సవం జరిగింది. విద్యార్థులను ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి పిలుస్తూ సర్టిఫికెట్‌లు ప్రధానం చేస్తున్నారు. అయితే, విద్యార్థులు సర్టిఫికెట్ అందుకోవడం కోసం స్టేజ్ పైకి వస్తున్నప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టడంగానీ, గట్టిగా కేకలు వేయడంగానీ చేయవద్దని ప్రిన్సిపాల్ లీసా మెసీ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుర్ రెహమాన్ అనే బాలికను సర్టిఫికెట్ అందుకునేందుకు స్టేజ్ మీదకు రావాలని పిలిచారు. దాంతో ఆ అమ్మాయి తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ చేస్తూ వెళ్లింది. దాంతో అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వారు. ఇది ప్రిన్సిపాల్‌కు కోపం తెప్పించింది. అంతే.. ఆ బాలికకు చీవాట్లు పెట్టి.. సర్టిఫికెట్ ఇవ్వకుండా వెనక్కి పంపింది. దాంతో బాలిక ఏడుస్తూ స్టేజ్ దిగిపోయింది.
అయితే, కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రిన్సిపాల్ రూమ్‌కు పిలిచి అబ్దుర్ రెహమాన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా రూల్స్ పాటించలేదనే కారణంతో ప్రిన్సిపాల్ రూమ్‌లోనే సర్టిఫికెట్‌లు అందజేశారు. కాగా, అబ్దుర్ రెహమాన్ అనే బాలిక డ్యాన్స్ చేస్తూ సర్టిఫికెట్ అందుకునేందుకు వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..