Titanic wreck: టైటానిక్ మళ్లీ ముంచేసిందిగా.. సబ్ మెరైన్ గల్లంతుపై అప్డేట్..
శతాబ్దం కిందట సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ను చూపించేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని సమాచారం.
శతాబ్దం కిందట సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ను చూపించేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని సమాచారం. జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
అమెరికా, కెనడాలకు చెందిన కోస్ట్ గార్డ్ లతో పాటు నేవీ సబ్ మెరైన్ లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు ఉన్నట్లు తేలింది. దీనిలో పాక్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, ఈ మినీ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ కూడా యాత్రికుల్లో ఉన్నట్లు తేలింది. వీరితోపాటు యూకే-యూఏఈ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్‌కు చెందిన పైలట్ పౌల్ హెన్రీ నార్జియోలెట్ కూడా ఉన్నారు. ఓషన్ గేట్ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్ శకలాల సందర్శన కూడా ఓ భాగం. న్యూఫౌండ్‌లాండ్ నుంచి ఈ యాత్ర మొదలైంది. 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. తొలి రెండు గంటల ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత దీనికి సపోర్టింగ్ షిప్‌గా వచ్చిన పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

