Watch Video: వామ్మో.. అకస్మాత్తుగా కిందకు కదిలిన లిఫ్ట్.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

|

Dec 27, 2022 | 7:12 PM

ఆధునిక యుగంలో పలు యంత్రాలు అందుబాటులోకి రావడంతో ప్రతిదీ సులభంగా సౌకర్యవంతంగా మారింది. భవనంలోని పై అంతస్థులకు వెళ్లాలన్నా.. దిగాలన్నా లిఫ్ట్ అత్యవసర సాధానంగా మారింది.

Watch Video: వామ్మో.. అకస్మాత్తుగా కిందకు కదిలిన లిఫ్ట్.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Viral Video
Follow us on

ఆధునిక యుగంలో పలు యంత్రాలు అందుబాటులోకి రావడంతో ప్రతిదీ సులభంగా సౌకర్యవంతంగా మారింది. భవనంలోని పై అంతస్థులకు వెళ్లాలన్నా.. దిగాలన్నా లిఫ్ట్ అత్యవసర సాధానంగా మారింది. బహుళ అంతస్థుల భవనాలలో లిఫ్ట్ సౌకర్యం తప్పనిసరిగా అవసరమే.. దీని ద్వారా సమయం తగ్గడంతోపాటు పని కూడా సులభంగా అవుతుంది.. పైగా శ్రమ కూడా ఉండదు. అందుకే సాధారణంగా అందరూ లిఫ్ట్‌నే ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే.. లిఫ్ట్‌ ఉపయోగిస్తున్న క్రమంలో ప్రమాదాలు కూడా సర్వసాధారణంగా మారుతున్నాయి. లిఫ్ట్‌ రాకముందే డోర్లు తెరుచుకోవడం, లిఫ్ట్‌ ఎక్కకముందే కదలడం, కిందపడటం లాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. తాజాగా వైరల్‌ అవుతున్న వీడియో లిఫ్ట్ ఎక్కాలంటే వణికిపోయేలా చేస్తోంది. ఇది చూస్తే.. లిఫ్ట్‌ ఎక్కేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మాత్రం ఖాయమంటున్నారు నెటిజన్లు..

తాజాగా.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఓ ఆసుపత్రి భవనంలోని లిఫ్టు పనిచేయకపోవడంతో రోగి కింద పడిపోతాడు. ఈ భయానక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ యూజర్ లాన్స్ పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ అటెండెంట్ రోగిని ఎలివేటర్ లోపల స్ట్రెచర్‌పై తీసుకుపోతుండటాన్ని చూపిస్తుంది. ఈ సయమంలో రోగికి చెందిన ఓ మహిళ కూడా ఉంది. లిఫ్ట్ తలుపు తెరిచుకుంటుంది. ఈ సమయంలో స్ట్రెచర్‌ను లోపలికి తీసుకెళ్లక ముందే.. ఎలివేటర్ కిందకు వెళుతుంది. ఈ క్రమంలో స్ట్రెచర్‌పై ఉన్న రోడి కిందపడిపోతాడు. రోగి పక్కన నిలబడి ఉన్న అటెండెంట్ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించడాన్ని వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అప్‌లోడ్ చేసినప్పటి నుంచి దీనిని 10.3 మిలియన్ సార్లు వీక్షించారు. ఈ ఘటన అక్టోబర్ 8న జరిగినట్లు పేర్కొంటున్నప్పటికీ.. ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.

ఈ వీడియోను చూసి చాలామంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎలివేటర్ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమవుతుందని.. జాగ్రత్త అవసరమని నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోతే.. ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..