Viral Video: భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న దంపతులు.. ఇంతలో ఒక్కసారిగా

అరిజోనాలోని ఫీనిక్స్‌లో మార్కస్ హోల్మ్‌బెర్గ్, సబ్రినా రివెరా దంపతులు నివాసం ఇంటిలోకి ఓ కారు గోడను బద్దలు కొట్టుకుంటూ దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం తాలూకా వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Viral Video: భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న దంపతులు.. ఇంతలో ఒక్కసారిగా
Car Cashed Into Home
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 04, 2024 | 2:42 PM

కారు అతివేగంగా నడపడం వల్ల జరిగిన విధ్వంసం తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ జంట రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా అదుపుతప్పిన కారు ఇంటి గోడను పగులగొట్టి లోపలికి ప్రవేశించడం సదరు వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసి నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడిన ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలోని ఫీనిక్స్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో దంపతులే కాకుండా వారి మూడు పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదం మొత్తం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

వీడియో దిగువన చూడండి….

ఆ భయానక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ..’ ఎవరో బాంబు పేల్చినట్లు అనిపించింది. మేం బ్రతికి ఉండటం అదృష్టం. అంతా చాలా వేగంగా జరిగింది” అని ఆ దంపతులు తెలిపారు. వైరల్ అయిన వీడియో క్లిప్‌లో, కారు గోడ పగులగొట్టి లోపలికి ప్రవేశించినప్పుడు ఇంట్లోని వ్యక్తి టేబుల్‌పై ఆహారాన్ని పెడుతుండటం మీరు చూడవచ్చు. 

ఈ వింత ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.  కారు డ్రైవర్‌ 18 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన వల్ల ఈ దంపతుల ఇల్లు చాలా డ్యామేజ్ అయింది. మరమ్మతులకు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందట. ఆ ఖర్చును కవర్ చేయడానికి GoFundMe ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతటి ప్రమాదం నుంచి తాము, తమ పెట్ డాగ్స్ ప్రాణాపాయం నుంచి బయటపడటం మిరాకిల్ అని అంటున్నారు వారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..