Viral Video: భారీ చేపకు ఆహారం ఇవ్వడానికి యువతి పడిన కష్టాలు.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్

తాజాగా ప్రపంచంలో అతిపెద్ద చేపగురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ చేప అట్లాంటిక్ టార్పాన్. ఇది చాలా పెద్దది మరియు భారీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: భారీ చేపకు ఆహారం ఇవ్వడానికి యువతి పడిన కష్టాలు.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2022 | 4:38 PM

Shocking video Viral: ప్రపంచంలో రకరకాల చేపలున్నాయి. వాటిల్లో కొన్ని చేపలు చాలా భారీగా  ఉంటాయి. సముద్రంలో లోతుల్లో నివసించే ఈ చేపలు చాలా పెద్దవి. వాటిలో తిమింగలం (Whale), సొర (Shark) చేపలు ప్రముఖమైనవి. ఈ రెండు చేపలు చాలా పెద్దవి. ఈ చేపలు ఒక వ్యక్తిని హాయిగా ఆహారంగా తినేస్తాయి. ఈ ప్రమాదకరమైన చేపలకు మనుషులు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది అని హెచ్చరిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి కనుక. మనుషులపై షార్క్ దాడి చేయడం గురించి తరచుగా  వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ షార్క్స్ దాడిలో కొన్నిసార్లు మనుషులు కూడా చనిపోతారు.  అయితే తాజాగా ప్రపంచంలో అతిపెద్ద చేపగురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ చేప అట్లాంటిక్ టార్పాన్. ఇది చాలా పెద్దది మరియు భారీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

మీకు కూడా ఏదో ఒక సమయంలో చేపలకు మేత తినిపించాలానే కోరిక కలుగుతుంది. చిన్న చేపలు పెద్ద చేపలకు ఆహారం.. ఇక టార్పాన్ చేప కూడా చిన్న చేపలతిని కడుపు నింపుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువతి నీటిలో తేలియాడే వల మీద ఉంది.. నీటిలోపలకు చేయి పెట్టి..  టార్పాన్ చేపకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ యువతి ఆహారం ఇచ్చే లోపు టార్పాన్ చేప ఆమె  చేతిని నోటితో పట్టుకుంది. ఆమె అదృష్టం ఏమిటంటే, ఆమె ఆ వ్యక్తి చేతిని తరువాత విడిచిపెట్టింది. ఆ టార్పన్ చేప ప్లేస్ లో ఏ సొరచేప ఉంటే.. ఖచ్చితంగా ఆ యువతి తన చేతిని కోల్పోయి ఉండేది. అది టార్ఫాన్ చేపకనుక సురక్షితంగా బయటపడింది. అయితే ఆ  చేప ఎగిరి.. ఆహారం కోసం ఆ యువతి చేతిని పట్టుకున్న విధానం చాలా ఆశ్చర్యకరమైన దృశ్యం.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by Sam Cook (@samcook.photos)

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో samcook.photos అనే ID పేరుతో షేర్ చేయబడింది.  ఇది ఇప్పటివరకు 60 లక్షల  వ్యూస్ ను 93 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..