AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాబ్ వదిలి వినూత్న వ్యాపారం… ఇప్పుడు లక్షల్లో ఆదాయం! సొంత ఇల్లు, లగ్జరీ కారుతో..

చేసే పనీ పెద్దది, చిన్నది అని కాదు, దాన్ని చేయడానికి కావలసింది కేవలం అభిరుచి మాత్రమే అని తరచుగా చెబుతుంటారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఇదే మాటను నిజమని నిరూపించారు. ఆమె తన కుక్కల మలాన్ని శుభ్రపరిచే వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని, ఇప్పుడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. బ్రిటన్‌కు చెందిన ఎమ్మా గార్నర్ అనే మహిళ స్ఫూర్తిదాయకమైన, వినూత్నమైన ప్రయాణం గురించి వివరిస్తుంది. సాధారణ ఉద్యోగాన్ని వదిలి, ఒక విభిన్నమైన వ్యాపారంతో ఆమె ఎలా విజయం సాధించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

జాబ్ వదిలి వినూత్న వ్యాపారం… ఇప్పుడు లక్షల్లో ఆదాయం! సొంత ఇల్లు, లగ్జరీ కారుతో..
Emma Garner Success Story
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2026 | 4:34 PM

Share

బ్రిటన్‌కు చెందిన 26 ఏళ్ల ఎమ్మా గార్నర్ అనే యువతి తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకుందో సోషల్ మీడియా వేదికగా వివరిస్తుంది. ఒత్తిడితో కూడిన సాధారణ ఉద్యోగాన్ని వదిలి, ఒక విభిన్నమైన మార్గంలో ఆమె సాధించిన విజయం విశేషం. ఇన్‌స్టా ప్లాట్‌ఫామ్‌పై ఎమ్మా గార్నర్ తన సక్సెస్‌ స్టోరీని షేర్‌ చేశారు. తన పాత ఉద్యోగంలో తక్కువ వేతనం, పని ఒత్తిడి వల్ల అసంతృప్తిగా ఉండేవారని, దాంతో ఏదైనా కొత్తగా, సొంతంగా చేయాలని నిశ్చయించుకున్నారు. ఆమె డాగ్ పూ క్లీనింగ్ (కుక్కల విసర్జితాలను శుభ్రం చేయడం) అనే భిన్నమైన పనిని ఎంచుకున్నారు.

గతంలో సేల్స్, కస్టమర్ సర్వీస్ రంగంలో పనిచేస్తూ అధిక పని ఒత్తిడిని ఎదుర్కొన్న ఎమ్మా, ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె స్కూప్ ది పూ (Scoop the Poo) అనే పేరుతో కుక్కల విసర్జితాలను శుభ్రం చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ వినూత్న వ్యాపారం ద్వారా ఆమె ప్రస్తుతం ఏడాదికి దాదాపు £30,000 (సుమారు 32 లక్షల రూపాయలు) పైగా సంపాదిస్తున్నారు. ఈ సంపాదనతో ఆమె తన కలల ఇంటిని కొనుగోలు చేయడమే కాకుండా, కొత్త కారును కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా, తన పని సమయాన్ని తనే నిర్ణయించుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానంటూ హ్యాపీగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @besteyorkshire

మొదట్లో ఇలాంటి పనిని ఎంచుకున్నందుకు కొందరు ఆశ్చర్యపోయినా, ఆమె సాధించిన ఆర్థిక స్వేచ్ఛ, విజయాన్ని చూసి ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఏ పనీ చిన్నది కాదని, కష్టపడే తత్వం, వినూత్న ఆలోచన ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఎమ్మా గార్నర్ కథ నిరూపిస్తోంది. ఆమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

Follow Us