AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: అతి తక్కువ పెట్టుబడితో లక్షలిచ్చే బిజినెస్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇదే బెస్ట్‌!

పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ వ్యాపారానికి దేశంలో మంచి డిమాండ్ ఉంది. చిన్న స్థాయి యూనిట్‌కు రూ.5-15 లక్షల పెట్టుబడితో నెలకు రూ.50,000-2 లక్షల లాభాలు పొందవచ్చు. యంత్రాలు, ముడిసరుకు సేకరణ, ప్రభుత్వ అనుమతులు కీలకం. సవాళ్లున్నా సరైన ప్రణాళిక, నిర్వహణతో ఈ వ్యాపారం లాభదాయకం, పర్యావరణానికి కూడా మేలు.

Business Idea: అతి తక్కువ పెట్టుబడితో లక్షలిచ్చే బిజినెస్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇదే బెస్ట్‌!
Money 5
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 5:41 PM

Share

పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ రీసైకిలింగ్ వ్యాపారానికి దేశంలో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య పెరుగుతుండటంతో, ఈ రంగంలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిపుణుల అంచనా ప్రకారం చిన్న స్థాయి ప్లాస్టిక్ రీసైకిలింగ్ యూనిట్ ప్రారంభించాలంటే కనీసం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇందులో యంత్రాలు, షెడ్డు అద్దె, విద్యుత్ కనెక్షన్, కార్మిక ఖర్చులు, రా మెటీరియల్ కొనుగోలు వంటి అంశాలు ఉంటాయి. మధ్యస్థ స్థాయి యూనిట్ కోసం ఈ పెట్టుబడి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. పెద్ద స్థాయి పరిశ్రమల కోసం అయితే కోటి రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.

ఈ వ్యాపారంలో ఉపయోగించే ముఖ్య యంత్రాల్లో ప్లాస్టిక్ ష్రెడర్, గ్రాన్యులేటర్, వాషింగ్ యూనిట్, డ్రైయింగ్ సిస్టమ్ ఉంటాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, శుభ్రపరచి, చిన్న ముక్కలుగా చేసి, తిరిగి గ్రాన్యూల్స్ రూపంలో మార్చడం ప్రధాన ప్రక్రియగా ఉంటుంది. లాభాల విషయానికి వస్తే, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌కు పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉండటంతో లాభదాయకత ఎక్కువగా ఉంటుంది. సరైన ముడిసరుకు సరఫరా, సమర్థవంతమైన నిర్వహణ ఉంటే నెలకు రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకు లాభాలు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్ తయారీ కంపెనీలు ఈ గ్రాన్యూల్స్‌ను కొనుగోలు చేస్తాయి.

అయితే ఈ రంగంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముడి ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ నిరంతరంగా జరగాలి. అలాగే ప్రభుత్వ అనుమతులు, కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతులు తప్పనిసరి. పర్యావరణ నిబంధనలు కఠినంగా ఉండటంతో వాటిని పాటించడం చాలా ముఖ్యం. విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం కూడా ఖర్చులను పెంచే అంశంగా మారుతుంది. మొత్తానికి సరైన ప్రణాళిక, మార్కెట్ అవగాహన ఉంటే ప్లాస్టిక్ రీసైకిలింగ్ వ్యాపారం లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ రంగం, భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us