AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతకంటే తక్కువ పేమెంట్‌కు UPI పిన్‌ అవసరం లేదు! ప్రముఖ బ్యాంక్‌ కీలక మార్పులు

ICICI బ్యాంక్ iMobile యాప్‌లో యూపీఐ లావాదేవీలకు బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను ప్రవేశపెట్టింది. దీనితో రూ.5,000 వరకు పిన్ లేకుండా వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇది డిజిటల్ లావాదేవీలను వేగవంతం చేస్తుంది, బహిరంగ ప్రదేశాల్లో పిన్ ఎంటర్ చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అంతకంటే తక్కువ పేమెంట్‌కు UPI పిన్‌ అవసరం లేదు! ప్రముఖ బ్యాంక్‌ కీలక మార్పులు
Upi 1
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 5:20 PM

Share

దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రత, వేగాన్ని మరింత మెరుగుపరచేందుకు ICICI బ్యాంక్‌ కీలక అడుగు వేసింది. తన మొబైల్ బ్యాంకింగ్ యాప్ iMobile ద్వారా యూపీఐ లావాదేవీల కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త సౌకర్యంతో వినియోగదారులు ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర ద్వారా సులభంగా చెల్లింపులను ఆమోదించవచ్చు. కొత్త విధానంలో రూ.5,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలకు ఇకపై పిన్ నమోదు అవసరం ఉండదు. వినియోగదారులు బయోమెట్రిక్ ధృవీకరణతోనే చెల్లింపులను పూర్తి చేయవచ్చు. దీంతో వేగవంతమైన ట్రాన్సాక్షన్లు సాధ్యమవుతాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పిన్ ఎంటర్ చేసే సమయంలో ఇతరులు గమనించే ప్రమాదం తగ్గి, భద్రత మరింత బలోపేతం అవుతుంది.

అయితే రూ.5,000కు మించిన లావాదేవీలకు మాత్రం ప్రస్తుత యూపీఐ పిన్‌ను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ద్వంద్వ విధానం ద్వారా సౌకర్యం, భద్రత మధ్య సమతుల్యతను సాధించాలనే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌ (v30), iOS (v28.2)లో తాజా వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫింగర్‌ప్రింట్ ద్వారా, iOS వినియోగదారులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా చెల్లింపులను ఆమోదించగలరు.

బయోమెట్రిక్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం కూడా సులభమే. వినియోగదారులు యాప్‌లో లాగిన్ అయి, UPI సెట్టింగ్‌లలోకి వెళ్లి, సంబంధిత ఖాతాను ఎంపిక చేసి బయోమెట్రిక్ ఆప్షన్‌ను ప్రారంభించాలి. ధృవీకరణ కోసం ఒకసారి UPI పిన్ నమోదు చేసిన తర్వాత, పరికరంలోని బయోమెట్రిక్ డేటాను నిర్ధారించాలి. డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న ఈ సమయంలో ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు మరింత సురక్షితమైన, సులభమైన అనుభవాన్ని అందిస్తుందని బ్యాంక్ పేర్కొంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో