పర్సు కొట్టేసి సముద్రంలో దూకేశాడు.. హెలికాప్టర్ ను చూసి సరేండర్ అయ్యాడు.. స్టోరీ చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

ఈ రోజుల్లో దొంగతనాలు కామన్ అయిపోయాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు.. మన దగ్గర ఉన్న వస్తువులను కొట్టేస్తున్నారు. ఇక తాళం వేసి ఉన్న ఇళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరూ లేని..

పర్సు కొట్టేసి సముద్రంలో దూకేశాడు.. హెలికాప్టర్ ను చూసి సరేండర్ అయ్యాడు.. స్టోరీ చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
Helecopter Thief
Follow us

|

Updated on: Oct 04, 2022 | 8:43 AM

ఈ రోజుల్లో దొంగతనాలు కామన్ అయిపోయాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు.. మన దగ్గర ఉన్న వస్తువులను కొట్టేస్తున్నారు. ఇక తాళం వేసి ఉన్న ఇళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి సర్వం దోచేస్తారు. వీటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, కుక్కలను పెంచుకోవడం, గార్డులతో సెక్యూరిటీ ఉన్నా దొంగతనాలు ఆగడం లేదు. అయితే కొంత మంది మాత్రం విచిత్రమైన దొంగతనాలకు పాల్పడుతుంటారు. పోలీసులకు దొరికిపోతామేమోననే భయం కూడా ఉండటం లేదు. దొంగలను పట్టుకున్న తర్వాత, కొందరు వ్యక్తులు వారికి దేహశుద్ధి చేసిన ఘటనలనూ మనం చూశాం. అయితే.. దొంగతనం చేసిన తర్వాత చోరులు తప్పించుకునేందుకు చాలా మార్గాలను ఎంచుకుంటారు. అలాగే ఈ వీడియోలో కూడా ఓ వ్యక్తి.. దొంగతనం చేసి తప్పించుకునేందుకు ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఓ మహిళ నిలబడి ఉండగా అప్పటికే అక్కడ ఉన్న ఓ దొంగ ఆమె పర్సు దోచుకుని అక్కడి నుంచి వేగంగా పరుగెత్తడం ప్రారంభించాడు. వెంటనే అలర్ట్ అయిన బాధితురాలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులను చూసి తీవ్రంగా భయపడిన దొంగ వారి నుంచి తప్పించుకోవడానికి సముద్రంలోకి దూకేశాడు. అయినా పోలీసులు అతనిని వదిలిపెట్టలేదు. అతణ్ని పట్టుకోవడానికి హెలికాప్టర్‌ను పిలిచారు. అతను హెలికాప్టర్ కంటే వేగంగా సముద్రం గుండా తప్పించుకోలేడని భావించి.. స్వయంగా లొంగిపోయాడు.

ఈ ఫన్నీ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో అక్టోబర్ 1 న తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ టంపా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్‌లో ఫోటోతో కూడిన పోస్ట్‌ను షేర్ చేసింది. హెలికాప్టర్ పైన తిరుగుతూ ఉండటాన్ని చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి