మలేషియా యూనివర్సిటీలో సల్లూభాయ్ సాంగ్ .. వైరల్ వీడియో

మన ఇండియన్ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకున్న చిత్రం భజరంగీ భాయ్‌జాన్. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్ నటించిన ఈ మూవీకి కబీర్‌ఖాన్ డైరెక్టర్. అయితే ఈ మూవీలో” తు జో మిలా.. కుక్దుకూ “అనే సాంగ్ ఎంతో మందిని కదిలించింది. మూడేళ్ల క్రితం రిలీజైన చిత్రంలోని ఈ పాట మళ్లీ వైరల్‌గా మారింది. మలేషియాలోని ఎంఎస్ యూనివర్సిటీలో విద్యార్ధులు దీన్ని గానం […]

మలేషియా యూనివర్సిటీలో సల్లూభాయ్ సాంగ్ .. వైరల్ వీడియో
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 17, 2019 | 7:39 AM

మన ఇండియన్ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకున్న చిత్రం భజరంగీ భాయ్‌జాన్. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్ నటించిన ఈ మూవీకి కబీర్‌ఖాన్ డైరెక్టర్. అయితే ఈ మూవీలో” తు జో మిలా.. కుక్దుకూ “అనే సాంగ్ ఎంతో మందిని కదిలించింది. మూడేళ్ల క్రితం రిలీజైన చిత్రంలోని ఈ పాట మళ్లీ వైరల్‌గా మారింది. మలేషియాలోని ఎంఎస్ యూనివర్సిటీలో విద్యార్ధులు దీన్ని గానం చేస్తూ కనిపించారు.

దేశం ఏదైనా సంగీతానికి హద్దులు లేవని ఈ గీతాన్ని ఆలపిస్తూ అక్కడి విద్యార్ధులు మరోసారి నిరూపించారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ కబీర్ సతీమణి మిన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

https://www.instagram.com/tv/B1IyY4TgbkX/