Viral Video: భవనంపై నిలబడి వీడియో రికార్డ్ చేస్తుండగా.. రష్యా క్షిపణి దాడి

రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: భవనంపై నిలబడి వీడియో రికార్డ్ చేస్తుండగా.. రష్యా క్షిపణి దాడి
Missile Attack
Follow us

|

Updated on: Mar 05, 2022 | 2:45 PM

Russia Ukraine War viral Video: రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌(Ukraine)కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఒక వ్యక్తి భవనం పక్కన నిలబడి వీడియోను రికార్డ్ చేస్తున్నాడు. వ్యక్తి తన భాషలో ప్రజలకు ఏదో చెబుతున్నాడు. రష్యా(Russia) – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి అతను కూడా తదుపరి బాధితుడు అవుతాడని అతనికి తెలియదు పాపం. ఆ వ్యక్తి తన వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు పైకి చూశాడు. అంతలోనే పెద్ద శబ్దం వినబడుతుంది. దీంతో అతను అక్కడ నుండి పరుగెత్తడం మొదలుపెట్టాడు. వీడియోలో వ్యక్తి నిలబడి ఉన్న భవనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. అదే భవనంపై క్షిపణిని జారవిడిచారు. ఆ తర్వాత ఆ భవనం పూర్తి శిథిలమైంది.

ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, ఉక్రెయిన్‌లోని ఒక వ్యక్తి భవనం దగ్గర హాయిగా నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. కెమెరాలోకి చూస్తూ ఏదో రికార్డ్ చేస్తున్నాడు. చుట్టుపక్కల వారికి సమాచారం ఇస్తున్నట్లు. అయితే అంతలోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రమాదం జరిగింది. బహుశా ఇలాంటివి జరుగుతాయని ఆ యువకుడు కూడా ఊహించి ఉండడు. అసలే అతని వీడియో రికార్డింగ్ చేస్తుండగా ఓ క్షిపణి వచ్చి అతడికి సమీపంలోని ఓ బిల్డింగ్‌ని ఢీకొట్టింది. యువకుడు పైకి చూసి ఏదో అర్థం చేసుకునే సమయానికి భవన శిథిలాలు అతనిపై పడటం ప్రారంభించాయి.

వీడియోను ఇక్కడ చూడండి:

ఆ యువకుడు అతి కష్టం మీద అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకున్నాడు. నడుస్తున్నప్పుడు, అతను తను రికార్డింగ్ చేస్తున్న కెమెరాను కూడా పడవేసి పరుగులు తీశాడు. ఆపై దాన్ని మళ్లీ తీసుకొని అక్కడ నుండి సురక్షితంగా బయలుదేరాడు. ఉక్రెయిన్‌లో ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వీడీయో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. రష్యా క్షిపణులు నివాస ప్రాంతాలపై కూడా దాడి చేస్తున్నాయి. అది ఖచ్చితంగా ఈ వీడియోలో కనిపిస్తుంది.

Read Also….

Russia Ukraine Crisis Live: యుద్దానికి బ్రేక్ ఇచ్చిన రష్యా.. కానీ తాత్కలికంగానే.. కారణం అదే అంటున్న నిపుణులు..!(వీడియో)