Viral: పొలం చదును చేస్తుండగా కనిపించిన మెరిసేటి రాయి.. ఏంటా అని పరిశీలించగా
బళ్లారి జిల్లాలోని ముద్దేనూరు గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన అరుదైన సూర్య, బ్రహ్మ విగ్రహాలు బయటపడ్డాయి. 'విజయనగర్ హెరిటేజ్ ఎక్స్‌ప్లోరేషన్ గ్రూప్' ఈ పురాతన శిల్పాలను గుర్తించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి ఈ స్టోరీలో..

విజయనగర్ హెరిటేజ్ ఎక్స్‌ప్లోరేషన్ గ్రూప్‌కు చెందిన పరిశోధనా బృందం బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని ముద్దేనూర్ గ్రామం సమీపంలో సూర్య భగవానుడి, బ్రహ్మదేవుడి రాతి శిల్పాలను కనుగొన్నారు. గ్రామానికి వెళ్లే రహదారి మార్గంలో ఉన్న మౌనేష్ అనే వ్యక్తికి చెందిన పొలం అంచున ఈ విగ్రహాలను గుర్తించారు. నల్లటి రాయితో చెక్కిన ఈ శిల్పాలను బాల్కుండి గ్రామానికి చెందిన స్థానికుల సహకారంతో ఈ పరిశోధన బృందం కనుగొంది. సూర్యుని విగ్రహం 51 సెం.మీ వెడల్పు, 83 సెం.మీ ఎత్తు, 13 సెం.మీ పాదాలు కలిగి ఉందని, రెండు చేతుల్లో తామర పువ్వులు పట్టుకుని, తల వెనుక వృత్తాకార వలయం చెక్కబడి ఉన్నట్లు గుర్తించారు.
11వ శతాబ్దానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. ఈ కాలంలో కురుగోడు సిందాస్ అనే పాలక కుటుంబానికి బాల్కుండే రాజధానిగా ఉండేది. బాల్కుండే అపారమైన చరిత్రక, పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే, సూర్యని విగ్రహం కాళ్ళు విరిగిపోయి ఉండటంతో.. చారిత్రాత్మకంగా ముఖ్యమైన కళాఖండాలు ఇప్పటికీ ఇలా వదిలేయడంతో.. వాతావరణ మార్పులకు ఇలా విరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్ తరాల కోసం ఇలాంటి శిల్పాలను భద్రపరచడం చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




