Viral: చేతికి 8 వేళ్లు.. ఎక్స్‌రే చూసిన డాక్టర్లకు దిమ్మతిరిగే షాక్.. అసలేమైందంటే..?
ఈ అరుదైన మిర్రర్ హ్యాండ్ సిండ్రోమ్‌ను ఉల్నార్ డైమెలియా(Ulnar Dimelia) అని కూడా అంటారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులకు సాధారణంగా..

మిర్రర్ హ్యాండ్.. ఈ అరుదైన వ్యాధితో ప్రపంచంలో చాలామంది బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ అరుదైన మిర్రర్ హ్యాండ్ సిండ్రోమ్‌ను ఉల్నార్ డైమెలియా(Ulnar Dimelia) అని కూడా అంటారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులకు సాధారణంగా ఏడు లేదా ఎనిమిది వేళ్లు ఉంటాయి. వీరికి బొటన వేలు ఉండదు. ఈ వ్యాధి దేని వల్ల వస్తుందోనన్న కారణాలు ఏవిలేవు గానీ.. ఇది పుట్టినప్పుడు లేదా ప్రసవానికి ముందు అల్ట్రాసౌండ్‌లో నిర్ధారిస్తారు.
ఎవరైనా కూడా ఈ మిర్రర్ హ్యాండ్ సిండ్రోమ్‌తో జన్మించినట్లయితే, ఆపరేషన్ ద్వారా దీనికి చికిత్స చేయవచ్చు. అయితే ఈ శస్త్రచికిత్సతో చేతి పనితీరు లేదా దానికి రూపం మారుతుంది. 2018లో యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో నివేదించిన ఓ కేసు ప్రకారం.. పాలీడాక్టిలీ(Polydactyly) అనే వ్యాధి వల్ల రెండు నెలల బాలిక అదనపు వేళ్లు కలిగి ఉంది. ఆ చిన్నారికి అనేక శస్త్రచికిత్సలు జరిగిన తర్వాతే.. ఆమె చేతికి సాధారణ సంఖ్యలో వేళ్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ నివేదిక ప్రచురించే సమయానికి ఉల్నార్ డిమెలియాతో 70 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ‘ఎగువ అవయవాల సరైన రీతిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఏర్పడేది ఈ మిర్రర్ హ్యాండ్ సిండ్రోమ్’ అని డాక్టర్లు వెల్లడించారు. ‘టైప్ 2 ఉల్నార్ డైమెలియా విషయంలో శస్త్రచికిత్స ద్వారా చేతి శరీర నిర్మాణాన్ని సరి చేసుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా బాధితుడి అంగీకారంతో జరుగుతుందని వైద్యులు చెప్పారు.(Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..
