Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: టర్కీ నుంచి వచ్చి.. జోధ్‌పూర్ రోడ్డు ఊడ్చిన 5 స్టార్ హోటల్ ఓనర్..!

అయేషా, ఆమె భర్త తమ కుటుంబంలోని 6 మంది సభ్యులతో కలిసి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చారని ఆయేషా గైడ్ సునీల్ సోలంకి చెప్పారు. ఆమె భర్త టర్కియేలో వ్యాపారవేత్త. 20 రోజుల క్రితం ఆమె భారత్‌కు వచ్చింది. ఆమె ఆగ్రా నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే జోధ్‌పూర్‌ గార్డెన్‌ను సందర్శించారు.

Watch Video: టర్కీ నుంచి వచ్చి.. జోధ్‌పూర్ రోడ్డు ఊడ్చిన 5 స్టార్ హోటల్ ఓనర్..!
Rajasthan News
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 31, 2025 | 9:14 PM

భారతదేశంలో పారిశుద్ధ్య కార్మికుడితో కలిసి చీపురు ఊడుస్తున్న విదేశీ మహిళ వీడియో సోషల్ మీడియా ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టర్కియే నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన 51 ఏళ్ల అయేషా అనే మహిళ రోడ్లు శుభ్రం చేసింది. జనవరి 30, గురువారం ఆమె తన కుటుంబంతో కలిసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మండోర్ గార్డెన్‌కు వెళ్లింది. అక్కడ ఆయేషా చీపురు ఊడుస్తూ 25 నిమిషాల పాటు శ్రమించింది.

ఆయేషా తోపాటు ఆమె కుటుంబం మాండోర్ గార్డెన్ నిర్మాణాన్ని చూసి పార్కింగ్ స్థలానికి వచ్చారు. తమ కారు వద్దకు తిరిగి వచ్చినప్పుడు, ఇద్దరు మహిళా పారిశుధ్య కార్మికులు రోడ్డు ఊడ్చడం చూశారు. అటువంటి పరిస్థితిలో, ఆయేషా మహిళా పారిశుధ్య కార్మికుని వద్దకు చేరుకుంది. తన భాషలో పారిశుధ్య కార్మికురాలితో రోడ్డు ఊడ్చాలనుకుంటున్నట్లు తన కోరికను వ్యక్తం చేసింది. తొలుత పారిశుధ్య కార్మికులకు అర్థం కాలేదు.. అయితే టూరిస్ట్‌ గైడ్‌ సునీల్‌ సోలంకి తమ కోరికను పారిశుధ్య కార్మికులకు వివరించగా.. మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఆయేషా చేతిలో చీపురు ఇచ్చారు. దీని తరువాత, ఆయేషా 25 నిమిషాల పాటు రోడ్డు శుభ్రపరచడంలో సహకరించింది. ఈ సమయంలో, అయేషాతో పాటు కుటుంబ సభ్యులు ఆమెను వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఊడ్చిన తర్వాత, ఆయేషాను ఆమె అలాంటి కోరిక ఎందుకు వ్యక్తం చేసింది? అన్న ప్రశ్న తలెత్తడంతో వివరణ ఇచ్చింది ఆయేషా. భారతదేశానికి వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి విన్నాను అని చెప్పారు. ఊడ్చే ఆడవాళ్ళని చూసినప్పుడు మనం కూడా కాస్త శ్రమదాన్ చేద్దాం అని అనిపించి వాళ్ళతో పాటు ఊడ్చేశాను. అంటూ చెప్పుకొచ్చింది ఆయేషా.

ఆయేషా రోడ్డు ఊడ్చేటప్పుడు, బహుశా ఆమె ఒకట్రెండు నిమిషాలు తుడుచుకుంటుందేమోనని అందరూ అనుకున్నారు. ఫోటో క్లిక్ చేసి వెళ్లిపోతారనుకున్నారు. అయితే ఆయేషా 25 నిమిషాల పాటు అక్కడ పార్కింగ్ స్థలాన్ని ఊడ్చి, పార్కింగ్ మొత్తం శుభ్రం చేసే వరకు శ్రమదానం చేసింది. ఓ విదేశీ మహిళ తుడుచుకోవడం చూసి పక్కనే ఉన్నవారు కూడా గుమిగూడి ఆయేషాను చూసి షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను అర్వింద్ శర్మ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది..

వీడియో చూడండి.. 

అయేషా, ఆమె భర్త తమ కుటుంబంలోని 6 మంది సభ్యులతో కలిసి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చారని ఆయేషా గైడ్ సునీల్ సోలంకి చెప్పారు. ఆమె భర్త టర్కియేలో వ్యాపారవేత్త. 20 రోజుల క్రితం ఆమె భారత్‌కు వచ్చింది. ఆమె ఆగ్రా నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీ, జైపూర్, ఉదయపూర్ మీదుగా జోధ్‌పూర్ చేరుకుంది. జోధ్‌పూర్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు. గత రెండు రోజుల్లో కుటుంబంతో కలిసి జోధ్‌పూర్‌లోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. జోధ్‌పూర్ పర్యటన చివరి దశలో, ఆమె మాండోర్ గార్డెన్‌ని సందర్శించడానికి వచ్చింది. మాండోర్ గార్డెన్‌ని సందర్శించిన తర్వాత, ఆయేషా తన ప్రయాణం కుటుంబంతో కలిసి జైసల్మేర్‌కు బయలుదేరారు. ఇప్పుడు అక్కడి నుంచి మౌంట్ అబూ సందర్శనకు వెళ్లనున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…