AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అప్పుడే పుట్టిన బిడ్డను చూసి గట్టిగా అరిచిన తల్లి..! అతను పెద్దయ్యాక ఎలా ఉన్నాడంటే..

సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే అంగవైకల్యం విజయానికి అడ్డుకాదని ఇప్పటికే అనేక మంది నిరూపించారు. తాజాగా అలాంటి ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఆ వ్యక్తి తన బలహీనతను బలంగా మార్చుకున్నాడు. అసాధ్యం అనుకునే పనులన్నీ అతడు అవలీలాగా చేస్తున్నాడు. అంతేకాదు.. అతను పిల్లలకు పాఠాలు చెప్పే ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో అతడు తన జీవితాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.

Watch: అప్పుడే పుట్టిన బిడ్డను చూసి గట్టిగా అరిచిన తల్లి..! అతను పెద్దయ్యాక ఎలా ఉన్నాడంటే..
Born Without Thumbs
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2025 | 5:26 PM

Share

వైద్యులు నవజాత శిశువును చేతుల్లోకి ఇచ్చిన ఆ క్షణంలో తల్లి అరుపులు డెలివరీ గది అంతటా ప్రతిధ్వనించాయి. కారణం..?ఆ శిశువుకు రెండు చేతుల్లో బొటనవేళ్లు లేవు. ఇది చైనాకు చెందిన 26 ఏళ్ల కియావో ఆల్బర్స్ కథ. కానీ, అతను తనకున్న ఈ బలహీనతను బలంగా మార్చుకున్నాడు. తన అంగవైకల్యాన్ని ఎలా ఎదిరిస్తున్నాడో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని బొటనవేళ్లు లేకుండా రోజువారీ పనులను ఎలా చేసుకుంటున్నాడో ఇక్కడ చూపించాడు. బొటనవేళ్లు ఐచ్ఛికం అనేదానికి నేను ఒక సజీవ ఉదాహరణ అంటున్నాడు.

క్వియావో చైనాలో జన్మించాడు. నాలుగు నెలల వయసులో నెదర్లాండ్స్‌కు దత్తతగా వెళ్లాడు. సంస్కృతికి అలవాటు పడటం అంత సులభం కాదు. చిన్నతనంలో అతను ఒంటరిగా భావించాడు. ముఖ్యంగా స్కూళ్లలో పిల్లలు తన చేతులను ప్రశ్నించేవారు. తన అనుభవాన్ని పంచుకుంటూ, నేను అభద్రతా భావానికి గురయ్యానని చెప్పాడు. ప్రతి ఒక్కరూ తనను చూడగానే.. అందరూ తన చేతుల గురించి అడుగుతారు అని అన్నాడు. కానీ యూరప్ అంతటా ప్రయాణించడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వివిధ దేశాలలోని ప్రజలను కలవడం, అతని చైనీస్ వారసత్వంతో కనెక్ట్ అవ్వడం అన్నీ అతనిని బలపరిచాయి. ఇప్పుడు, అతను చైనాకు తిరిగి వచ్చాడు. అక్కడ అతను ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆన్‌లైన్‌లో ప్రజలతో తన జీవితాన్ని పంచుకుంటాడు.

ఇవి కూడా చదవండి

అతడు Instagram లో @qiaodi_lucky_8 అనే హ్యాండిల్ ద్వారా యాక్టివ్‌గా ఉన్న Qiao వీడియోలు మిలియన్ల కొద్దీ వీక్షణలను సంపాదించాయి. ఒక వీడియోలో అతను ఒక బాటిల్‌ను తెరిచి తన చూపుడు, మధ్య వేళ్లతో బాటిల్‌ క్యాప్‌ ఓపెన్‌ చేస్తున్నాడు. ఆపై ఒక గ్లాసులో ఒక చుక్క కూడా కింద పడకుండా నీరు పోస్తాడు. తన బొటనవేళ్లు లేకుండా ఇవన్నీ ఎలా చేయగలనని ప్రజలు తనను అడిగారని అతను వివరించాడు. కానీ చూడండి, నేను దీన్ని ఎలా చేస్తాను అంటూ చూపించాడు. హిచ్‌హైకింగ్ గురించి అతను జోక్ చేసే అతని వీడియోలలో ఒకటి 6.7 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ సాధించింది. నేను నా బొటనవేలుతో సిగ్నల్ ఇవ్వడం తప్ప ప్రతిదీ చేయగలను అని చెబుతున్నాడు.

క్వియావో ఎలాంటి ప్రోస్తేటిక్స్ లేదా అనుసరణలను ఉపయోగించడు. నేను అన్నీ నేనే చేయగలను అని అంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అతను అంటాడు. ఒక వీడియోలో, అతను నాలుగు వేళ్లతో వాటర్ బాటిల్ తాగి, ఆపై దానిని వయోలిన్ లాగా తిప్పుతున్నట్లు చూపించాడు. కానీ, అతనికి ఎదరురయ్యే సవాళ్లు తక్కువేమీ కాదు. టచ్‌స్క్రీన్‌పై టైప్ చేయడం అతనికి కష్టం. అతను బొటనవేళ్లు పైకి లేపే సంజ్ఞ చేయలేడు. కొత్త వ్యక్తులను కలవడం ఇప్పటికీ అతన్ని భయపెడుతుంది. అయినప్పటికీ, అతను తన పరిస్థితిని బహుమతిగా భావిస్తాడు. రేపు ఉదయం బొటనవేళ్లు తిరిగి పెరిగినా, నేను వాటిని తిరిగి ఇంచేస్తానని అంటున్నాడు. 26 ఏళ్ల అలవాటును మానుకోవడం కష్టం – మళ్ళీ నడవడం నేర్చుకోవడం వంటివి అంటున్నాడు క్వియావో.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..