Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇవి హైదరాబాద్ పావురాలు మరీ.. ఎందులోనూ తగ్గేదెలా..! కదులుతున్న వాహనం నుంచి ధాన్యం చోరీ..

స్మార్ట్ పావురాల గుంపు చేసిన తెలివైన పనికి సంబంధించిన వీడియో ఇది.. వాహనం వేగంగా కదులుతున్న సమయంలో కొన్ని పావురాలు తమ పొట్ట నింపుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఆ వెహికిల్‌ వేగంగావెళ్తున్నప్పటికీ అవి బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో లోడ్‌ చేసిన

Viral Video: ఇవి హైదరాబాద్ పావురాలు మరీ.. ఎందులోనూ తగ్గేదెలా..! కదులుతున్న వాహనం నుంచి ధాన్యం చోరీ..
Pigeons Steal Grain
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 25, 2023 | 9:00 PM

సోషల్ మీడియాలో మనల్ని నివ్వెరపరిచే, మళ్లీ మళ్లీ చూడాలనిపించే దృశ్యాలు అనేకం వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇది కూడా అదే లైన్‌కి చెందిన సన్నివేశం. కదులుతున్న వాహనంలో పావురాలు గన్నీ బ్యాగుల్లోని ధాన్యాన్ని తింటున్న ఈ వీడియో సహజంగానే అందరినీ విస్మయానికి గురి చేసింది. స్మార్ట్ పావురాల గుంపు చేసిన తెలివైన పనికి సంబంధించిన వీడియో ఇది.. వాహనం వేగంగా కదులుతున్న సమయంలో కొన్ని పావురాలు తమ పొట్ట నింపుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఆ వెహికిల్‌ వేగంగావెళ్తున్నప్పటికీ అవి బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో లోడ్‌ చేసిన సంచుల్లోంచి గింజలను వీలైనంత వరకు తినేందుకు ప్రయత్నించాయి…! పక్షులు ధాన్యాన్ని దొంగిలిస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పావురాలు చేసిన తెలివైన పని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ వీడియోను @shibustuff ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియోలో చూపించినట్టుగా రద్దీగా ఉండే రోడ్డులో బస్తాలతో నిండిన వాహనం వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో వచ్చిన ఒక పెద్ద పావురాల గుంపు ఈ వాహనంపై దాడి చేసింది. అలా వాలిన పావురాలు సంచిలో ఉన్న ధాన్యాన్ని పొడుచుని తినడం మొదలుపెట్టాయి.. వాహనం కదులుతున్నప్పటికీ ఈ పక్షులు బ్యాగులోని ధాన్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తింటున్న దృశ్యం ఆశ్చర్యం కలిగించింది. ఈ వీడియోలోని దృశ్యం హైదరాబాద్‌లోనే చిత్రీకరించినట్లు సమాచారం. వాహనం కదులుతుండగా, పావురాలు ఎగబడి గింజలు తింటున్న దృశ్యాన్ని చుట్టుపక్కలవారు తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో బంధించారు. వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shibani Mitra (@shibustuff)

సహజంగానే ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాన్ని అందరూ ఎంతో ఉత్సుకతతో చూస్తున్నారు. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ఖాతాలలో చక్కర్లు కొడుతోంది. కొందరు ఫన్నీగా రెస్పాన్స్ కూడా ఇచ్చారు. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొందరు హైదరాబాద్‌ పావురాలు అందుకే వెరీ స్మార్ట్‌ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు..అయితే, ఆ పావురాల కష్టం పొట్ట నింపుకోవటానికే అంటూ మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు