AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా..ఏం ఐడియా గురూ..! ఇంటికి తాళం కూడా వెయ్యొచ్చా..? ఆలోచన అదుర్స్…

మీరు ఏదైనా తలుపును లైట్ గా లాక్ చేయాలనుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వొచ్చు.. ఈ లాక్ చాలా భద్రంగా కూడా ఉంటుంది. ఈ తాళం చాలా ఈజీగా కూడా ఓపెన్ అవుతుంది. పైగా ఈ తాళం తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం ఒక ప్లాస్టిక్ బాటిల్ మూత ఒక్కటి ఉంటే సరిపోతుంది. పైగా పైసా ఖర్చు లేదు.

Viral Video: వారెవ్వా..ఏం ఐడియా గురూ..! ఇంటికి తాళం కూడా వెయ్యొచ్చా..? ఆలోచన అదుర్స్...
Plastic Bottle Cap
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2023 | 8:08 PM

Share

పనికిరాని వస్తువులతో అద్భుతాన్ని సృష్టించే ప్రతిభావంతులైన వ్యక్తులు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. పనికిరానివిగా మనం విసిరిపారేసే వస్తువులను ఉపయోగించి కళాత్మకమైన ఇతర వస్తువులను సృష్టించే సృజనాత్మక, ప్రతిభావంతులైన వ్యక్తులను మీరు చూసే ఉంటారు. అలాంటి వారి ప్రయత్నాలను ప్రశంసించకుండా ఉండలేరు. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి జుగాద్ ఆలోచనకు సంబంధించిన వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి. అటువంటిదే ఒక వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇది ఒక వినూత్న ఆలోచన. ఇక్కడ కొందరు ప్లాస్టిక్ బాటిల్ మూతతో తలుపు లాక్ చేసారు. ఈ ఆలోచన చాలా మందికి నచ్చింది.

మీరు ఏదైనా తలుపును లైట్ గా లాక్ చేయాలనుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వొచ్చు.. ఈ లాక్ చాలా భద్రంగా కూడా ఉంటుంది. ఈ తాళం చాలా ఈజీగా కూడా ఓపెన్ అవుతుంది. పైగా ఈ తాళం తయారు చేయడం కూడా చాలా సులభం. దీని కోసం ఒక ప్లాస్టిక్ బాటిల్ మూత ఒక్కటి ఉంటే సరిపోతుంది. పైగా పైసా ఖర్చు లేదు. వ్యర్థంగా విసిరి పారేసే ప్లాస్టిక్ బాటిల్‌ మూతతో స్ట్రాంగ్‌ లాక్‌ తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక తలుపుకు అమర్చిన మూతను ఓపెన్‌ చేయటంతో అక్కడ డోర్లు ఓపెన్‌ అయ్యాయి. బాటిల్‌ మూతను తెరవగానే..ఆ తలుపు తెరుచుకుంటుంది. మళ్ళీ వాళ్లు తలుపు వేసి మూత మూయడంతో తలుపుకు తాళం వేసినట్టైంది. ఈ తాళం ప్లాస్టిక్ బాటిల్ మూతని సగానికి కట్ చేసి తలుపుకు రెండు వైపులా బలంగా అతికించి తయారు చేశారు. ఆ మూతను తిప్పి ఓపెన్ చేయగానే.. డోర్లు తెరుచుకుంటాయి. తిరిగి డోర్లు దగ్గరకు వేసిన మూత బిగిస్తే.. డోర్లకు తాళం పడుతుంది.. ఈ తాళం చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుందని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఊహించిన విధంగానే ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో సెప్టెంబర్ 19న @viralwarganet పేజీలో షేర్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోని చాలా మంది వీక్షించారు. ఈ ఐడియా చూసిన నెటిజన్లు జుగాడ్‌ ప్రయత్నం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా, ఇది సమర్థవంతమైన ఆలోచన అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కొందరు రియాక్షన్స్‌ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..