Watch Video: మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. హవ్వ.. మెట్రో ట్రైన్‌లో అందరూ చూస్తుండగానే..

Delhi Metro Video: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పదేపదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. ప్రయాణీకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రయాణ సమయంలో ట్రైన్‌లో అనుచితమైన, అసభ్యకరంగా ప్రవర్తించొద్దని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. యువత అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ సూచనలు ఇలా వింటూ అలా వదిలేస్తున్నారు. ఈ మార్గదర్శకాలను విస్మరించి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అనేక జంటల వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ జంట బహిరంగంగా రెచ్చిపోయింది.

Watch Video: మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. హవ్వ.. మెట్రో ట్రైన్‌లో అందరూ చూస్తుండగానే..
Delhi Metro Train
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2023 | 10:18 PM

Delhi Metro Video: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పదేపదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. ప్రయాణీకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రయాణ సమయంలో ట్రైన్‌లో అనుచితమైన, అసభ్యకరంగా ప్రవర్తించొద్దని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. యువత అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ సూచనలు ఇలా వింటూ అలా వదిలేస్తున్నారు. ఈ మార్గదర్శకాలను విస్మరించి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అనేక జంటల వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ జంట బహిరంగంగా రెచ్చిపోయింది. ప్రజలందరూ చుట్టూ ఉన్నప్పటికీ.. ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే.. లిప్ కిస్‌తో రెచ్చిపోయారు. హగ్గులు, ముద్దులతో రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్ల నుంచి నెక్ట్స్ లెవల్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాలను ఓసారి చూద్దాం..

ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో రాసలీలు కామ్ అయిపోయాయి. రెడ్ లైట్ ఏరియా కంటే కూడా దారుణంగా మారింది పరిస్థితి. ఇటీవలి కాలంలో వరుసగా అసభ్యకరమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. యువతీ, యువకులు విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ.. పబ్లిక్ ప్లేస్‌లో రెచ్చిపోతున్నారు. గతంలో కొన్ని జంటలు బహిరంగంగా మాస్టర్‌బేషన్ చేసుకోవడం, అంతకంటే హీనమైన చర్యలకు పాల్పడిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా అంతకు మించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఢిల్లీ మెట్రో ట్రైన్ ఎక్కిన యువతీ, యువకుడు.. మెట్రో డోర్ క్లోజ్ కావడమే ఆలస్యం అన్నట్లుగా రెచ్చిపోయారు. ఒకరినొకరు పట్టుకుని, హగ్ చేసుకుంటూ, ముద్దులతో రచ్చ చేశారు. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ లక్ష్యపెట్టకుండా.. ఏ సర్టిఫికెట్ సినిమా చూపించేశారు. అయితే, వీరి ఏ సర్టిఫికెట్‌ సీన్‌ను మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.

ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ జంట ఆనంద్ విహారం రైల్వే స్టేషన్‌లో ఎక్కగా.. నెటిజన్లు దానికి కూడా సెటైర్ వేస్తున్నారు. ఆనంద్ విహార్.. నిజంగా ఆనందాన్నిస్తోందని కామెంట్స్ చేశారు. అంతేకాదు.. కొందరు నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి.. ఓయో రూమ్‌గా మారిన ఢిల్లీ మెట్రో ట్రైన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీరి చర్యపై చాలా మంది సీరియస్ అయ్యారు. ఈ వీడియోను ఢిల్లీ మెట్రో అథారిటీకి ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..