AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అక్కో… ఏందా చూపు.. జ్వరమొచ్చేలా ఉంది..?

షాప్‌కు చెడు దృష్టి తగలకుండా ఉండేందుకే ఈ ఫొటో ఏర్పాటు చేశారని అసలు విషయం తెలిసిన వారు చెప్పుకొచ్చారు. బేరాలు ఆడకుండా నోర్మూసుకొని కూరగాయలు కొనుక్కు వెళ్లండి అన్నట్లుగా ఆమె చూపు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను చూశాక ఇక నిద్ర ఎలా పడుతుందంటూ మరొకరు కామెంట్ చేశారు.

Viral: అక్కో... ఏందా చూపు.. జ్వరమొచ్చేలా ఉంది..?
Trending Photo
Ram Naramaneni
|

Updated on: May 12, 2024 | 3:40 PM

Share

బెంగళూరులోని ఓ కూరగాయల దుకాణం ముందు వేలాడదీసిన ఓ మహిళ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కళ్లు పెద్దవి చేసుకుని కోపంగా చూస్తున్న ఆమె ఫొటోను చూసిన వారంతా ఇదేం చూపురా బాబోయ్ అంటూ జడుసుకుంటున్నారు. ఈ ఫోటో ఎందుకు పెట్టారా..? అని గెస్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘ఎక్స్’లో నిహారిక అనే యూజర్ షేర్ చేసిన కాసేపటికే ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. షేర్ చేసిన రెండు రోజులకే ఈ ఫొటోకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. బెంగళూరులోని కాత్రిగుప్పె వాటర్ ట్యాంక్ సమీపంలోని దుకాణం వద్ద ఈ ఫొటో ఏర్పాటు చేసినట్లు కొందరు చెబుతున్నారు.

దుకాణానికి చెడు దృష్టి తగలకుండా ఉండేందుకే ఈ ఫొటో ఏర్పాటు చేశారని అసలు విషయం తెలిసిన వారు చెప్పుకొచ్చారు. దీనిపై చాలా మంది యూజర్లు చిత్రమైన కామెంట్లు పోస్ట్ చేశారు. ఇక్కడ బేరాల్ లేవమ్మ అంటూ ఆమె వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఆమె చూపు ఉందని ఓ యూజర్ కామెంట్‌ చేశాడు. మరొకరేమో ఈ ఫొటోను చూస్తే పిల్లలు పక్కాగా భపడతారని పేర్కొన్నారు. వామ్మో.. ఈ ఫోటో చూశాక నాకు నిద్ర పట్టడం లేదు.. అర్జెంటుగా డాక్టర్‌ను సంప్రదించాలని మరొకరు రాసుకొచ్చారు. అరె.. ఈమె అచ్చం మన తెలంగాణ శకుంతలలా ఉందని ఓ యూజర్ చమత్కరించగా..  జీతం పెంచాలని అడిగినప్పుడు మా బాస్ చూపు ఇలాగే ఉంటుందని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్