AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో..ఈ కోడికి నాలుగు కాళ్లున్నాయ్..! ఎలా నడుస్తుందో చూస్తే..

సాధారణంగా ఏ పక్షికి అయినా రెండు కాళ్ళు ఉంటాయి. కానీ, కోడికి నాలుగు కాళ్ళు ఉంటాయని చెబితే మీరు నమ్ముతారా..? అదేంటి జంతువులకు ఉన్నట్టుగా కోడికి నాలుగు కాళ్లేంటి అని ఆశ్చర్యపోతారు. ఔరా ఇదెక్కడి వింత అని ముక్కున వేలేసుకుంటారు..కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో నిజంగానే ఒక కోడికి నాలుగు కాళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కోడి వీడియో నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తుంది.

Viral Video: వామ్మో..ఈ కోడికి నాలుగు కాళ్లున్నాయ్..! ఎలా నడుస్తుందో చూస్తే..
Four Legged Hen
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2025 | 5:18 PM

Share

వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన చేతుల్లో తెల్లటి కోడిని పట్టుకుని ఉన్నాడు. దానికి రెండు కాదు, నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఈ వైరల్ వీడియోను @ruko_bhaiii అనే ఖాతా నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దూరం నుండి చూస్తే కోడి సాధారణంగా కనిపిస్తుంది. కానీ, దగ్గరగా పరిశీలిస్తే దాని నాలుగు కాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. వీడియోలో,ఆ వ్యక్తి కోడి కాళ్ళను ఒక్కొక్కటిగా లెక్కించి కెమెరా ముందు ప్రతి కోణం నుండి వాటిని చూపించాడు. ఎటువంటి సందేహం రాకుండా ఉండటానికి అతను ఇలా చేస్తాడు. కోడికి నాలుగు కాళ్ళు ఉండటం అనేది సాధారణ విషయం కాదు. ఇదొక వింత అంటున్నారు నెటిజన్లు. దీనిని జన్యు పరివర్తనగా పశువైద్యులు అంటారు. ఇటువంటి జన్యుపరమైన సమస్యలతో పుట్టిన జంతువులు, పక్షులు ఎక్కువ రోజులు బతికి ఉండటం చాలా అరుదైన పరిస్థితి అంటున్నారు.

ఈ అరుదైన జన్యుపరమైన రుగ్మతలో పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో శరీరంలో అదనపు అవయవాలు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని పాలీమెలియా అంటారు. ఇందులో శరీరంలోని ఏదో ఒక భాగంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అదనపు అవయవాలు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా రెండు కవల పిండాలలో ఒకటి పూర్తిగా అభివృద్ధి చెందలేక మరొక పిండంతో జతచేయబడినప్పుడు ఇది జరుగుతుంది. అదనపు అవయవాలు ఒక శరీరంలో కనిపిస్తాయి. అయితే, అలాంటి కోళ్లు తరచుగా సాధారణ జీవితాన్ని గడపలేవు. వాటి అదనపు కాళ్ళు చాలాసార్లు పనిచేయవు. ఈ పరిస్థితి మానవులలో, ఇతర జంతువులలో కూడా కనిపించింది. కానీ ఇది చాలా అరుదు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీడియోపై చాలామంది ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది దీనిని ప్రకృతి అద్భుతంగా పిలుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి