Viral Video: ఈ నాగుపాము చిన్నదైనా పడగ విప్పింది.. తర్వాత ఈ 2 కోళ్లు ఏం చేశాయంటే..?
సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో రెండు కోళ్లు కలిసి ఓ చిన్న పాముపై దాడి చేసిన దృశ్యం కనిపిస్తోంది. మొదట ఆ బుడ్డి పాము పడగ విప్పడంతో.. వెనక్కి తగ్గిన పాములు.. ఆ తర్వాత అదును చూసి.. దానిపై అటాక్ చేశాయి. ఈ ఘటన ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

పాముల వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అదేంటో పాములు అంటే భయమున్నవారు సైతం వాటి వీడియోలు చూసేందుకు మాత్రం ఆసక్తి కనబరుస్తూనే ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో రెండు కోళ్లు, ఒక పాముకు సంబంధించినది. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అందులో రెండు కోళ్లు కలిసి పాము పిల్లను తిన్నాయని రాసుకొచ్చారు.
వీడియో ఓపెన్ చేయగానే ముందుగా.. రెండు కోళ్లు, ఒక పిల్ల పాము కనిపిస్తాయి. తొలుత కోళ్లు పామును వేటాడటం గమనించివచ్చు. అయితే ఆ పాము.. పిల్ల అయినప్పటికీ పడగవిప్పి వెంటనే డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కోళ్లు కాసేపు వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత అదును చూసి ఆ పాము జారుకునేందుకు ప్రయత్నించింది. కోళ్ళు దాని వెంట పరుగెత్తుకుంటూ వెళ్లి తమ ముక్కులతో దానిపై దాడి చేస్తాయి. కోళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి పాము తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ ఫెయిల్ అయినట్లే అర్థమవుతుంది. వీడియో ఎండింగ్ పూర్తిగా లేనప్పటికీ.. ఆ పామును కోళ్లు తినేసి ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
