Pakistan: అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.. అందుకే కొట్టా.. పాకిస్తానీ రిపోర్టర్ వివరణ

పాకిస్థాన్ (Pakistan) లో ఓ టీవి ఛానల్ రిపోర్టర్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఓ బాలుడిని కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై సదరు రిపోర్టర్....

Pakistan: అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.. అందుకే కొట్టా.. పాకిస్తానీ రిపోర్టర్ వివరణ
Pakistani Reporter
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 15, 2022 | 7:50 PM

పాకిస్థాన్ (Pakistan) లో ఓ టీవి ఛానల్ రిపోర్టర్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఓ బాలుడిని కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై సదరు రిపోర్టర్ స్పందించారు. బాలుడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వివరించారు. బక్రీద్ సందర్భంగా ఓ మహిళా రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఒక బాలుడి చెంపపై కొట్టారు. ఆమె చేసిన పనిని చూసి, చాలా మంది ఆమెను లేడీ చంద్-నవాబ్ అని కామెంట్లు చేశారు. ఈ ఘటనపై స్పందించిన రిపోర్టర్ మైరా.. తాను ఓ కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. ఆ బాలుడు తనను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పారు. అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను పద్ధతి మార్చుకోలేదని చెప్పారు. అంతే కాకుండా వెకిలి చేష్టలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఆ బాలుడు తన మాటలు పట్టించుకోకుండా ఇంటర్వ్యూ చేసేవారి కుటుంబాన్ని వేధిస్తూనే ఉన్నాడని, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. అతడు చేసిన పనికి ఇక తట్టుకోలేక కొట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

పాత ట్వీట్‌లానే ఈ ట్వీట్ కూడా వైరల్‌గా మారింది. జర్నలిస్టుకు పలువురు సపోర్ట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఆ రిపోర్టర్ తనను డిస్టర్బ్‌ చేస్తున్నాడన్న కారణంతో బాలుడిని చెంపదెబ్బ కొట్టింది. ట్విటర్‌లో ఈ వీడియోను 3.8 లక్షల మందికి పైగా చూశారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్‌లో ఈద్ ఉల్-అదా వేడుకలపై రిపోర్టింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బక్రీద్ వేడుకల సందర్భంగా.. జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తుండగా ఆమె దగ్గర మహిళలు, పిల్లలు నిల్చొని ఉన్నారు. అయితే ఆమె రిపోర్టింగ్ ముగిసిన వెంటనే.. రిపోర్టర్ పక్కన నిలబడి ఉన్న తెల్ల చొక్కా ధరించిన యువకుడిని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాన్ని చూడవచ్చు. డిస్టర్బ్ చేయడంతో రిపోర్టర్‌కి చిర్రెత్తుకొచ్చిందని.. దీంతో ఆమె బాలుడిని కొట్టినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి