Viral Video: అడ్డొస్తే తాటతీస్తా.. కర్ర పట్టుకోని అమ్మాయిని కొట్టిన శునకం.. నెట్టింట నవ్వులే నవ్వులు..
Dog thrashed Girl Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇవి కొన్మని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని
Dog thrashed Girl Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇవి కొన్మని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. ఎక్కువగా వైరల్ అయ్యే వాటిల్లో జంతువులకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. ప్రత్యేకించి కుక్కలకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎప్పుడూ కూడా హల్‌చల్ చేస్తుంటాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువులలో కుక్కలు ఒకటి. ఇవి విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి. ప్రపంచంలో ప్రజలు ఎక్కువగా పెంచుకునే జంతువు కుక్క కావడానికి ఇదే కారణం. ఏం నేర్పించినా త్వరగా నేర్చుకుంటుంది.. అదేవిధంగా ఆపదలో సైతం ప్రాణాలు సైతం పణంగా పెట్టేందుకు సిద్ధమవుతుంది. తాజాగా.. ఒక కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తరచుగా.. ఇంట్లో చాలాసార్లు పిల్లలు మారం చేస్తుంటే గద్దిస్తుంటాం.. ఇంకా ఎక్కువైతే రెండు దెబ్బలు వేస్తాం.. ఇందులో కుక్క కూడా అచ్చం ఇలానే చేసింది. కుక్క కర్రతో కొట్టడం ఎప్పుడైనా చూసారా? ఈ వీడియోలో కుక్క అమ్మాయిని కర్రతో కొట్టింది. నొటితో కర్రను పట్టుకొని యువతిని కొట్టింది. కుక్క కొట్టడం ఏంటీ.. అని ఆలోచిస్తున్నారు కదా..? అయితే.. ఈ వైరల్ వీడియోను చూడండి..
వైరల్ వీడియో..
View this post on Instagram
కుక్కకు సంబంధించిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా మళ్లీ మళ్లీ వీక్షిస్తూ లైకులు చేస్తూ ప్రేమను కురిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
Viral Video: