AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నది లేదు, బావి లేదు.. నేరుగా గాలి నుంచే మంచినీరు! అందుబాటులోకి అద్భుత సాంకేతికత

పర్వత ప్రాంతాలలో లేదా సుదూర ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీటిని పొందడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. చలికాలంలో నదులు, కాలువలు గడ్డకట్టుకుపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. అయితే, ఈ సమస్యకు నూతన సాంకేతికత అద్భుతమైన పరిష్కారాన్ని చూపించింది. ఏకంగా గాలి నుంచే తాగునీటిని తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అసలు గాలి నుంచి నీరు ఎలా తయారవుతుంది?

నది లేదు, బావి లేదు.. నేరుగా గాలి నుంచే మంచినీరు! అందుబాటులోకి అద్భుత సాంకేతికత
Atmospheric Water Generator
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2026 | 11:42 AM

Share

నదులు, బావులు లేదా పైప్‌లైన్లు లేని దుర్భర ప్రదేశాలలో మంచినీటి కొరతకు సైన్స్ ఓ వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ సాంకేతికత ద్వారా గాలిలోని తేమను నేరుగా తాగునీరుగా మారుస్తున్నారు. లీటరు నీటి ఉత్పత్తికి కేవలం రూ.3.5 పడుతుండగా, సోలార్ పవర్ ఉపయోగిస్తే ఈ ఖర్చు రూ.1.5 కి తగ్గుతుంది. ఇది కొండ ప్రాంత ప్రజలకు గొప్ప ఉపశమనం.

గాలి నుంచి నీరు ఎలా తయారవుతుంది?:

ఈ వినూత్న పరికరాన్ని అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ అని పిలుస్తారు. వేకువజామున వాతావరణంలోని తేమ ఆకులపై మంచు బిందువులుగా మారే సహజ సూత్రం ఆధారంగానే ఇది పనిచేస్తుంది. ముందుగా ఈ మిషన్ చుట్టూ ఉన్న గాలిని లోపలికి పీల్చుకుంటుంది. ప్రత్యేక ఫిల్టర్ల ద్వారా ధూళి, దుమ్మును తొలగిస్తుంది. శుభ్రం చేసిన గాలిని డ్యూ పాయింట్ వరకు చల్లబరుస్తారు. దీనివల్ల గాలిలోని తేమ అంతా నీటి చుక్కలుగా మారుతుంది. సేకరించిన నీటిని 5-దశల ఫిల్ట్రేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. UV, మినరల్ ఫిల్టర్లను ఉపయోగించి క్రిములను సంహరించి, శరీరానికి అవసరమైన ఖనిజాలను జోడిస్తారు.

పైప్‌లైన్లు వేయడం సాధ్యం కాని లడఖ్, సియాచిన్ వంటి గడ్డకట్టే హిమపాత ప్రాంతాలలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారత సరిహద్దు భద్రతా దళాలు తమ తాగునీటి అవసరాల కోసం AWG పరికరాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. కోల్‌కతాకు చెందిన అక్వో వంటి భారతీయ కంపెనీలు రోజుకు 50 లీటర్ల నుండి 1 లక్ష లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే యంత్రాలను తయారు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎంత ఖర్చవుతుంది? నీరు సురక్షితమేనా?:

సాధారణ విద్యుత్‌తో లీటరు స్వచ్ఛమైన నీటిని తయారు చేయడానికి కేవలం రూ.3.5 మాత్రమే ఖర్చవుతుంది. అదే సోలార్ విద్యుత్ ఉపయోగిస్తే ఈ ఖర్చు రూ.1.50 పైసలకు తగ్గుతుంది. కాలుష్యంతో కూడిన గాలి నుండి తయారు చేసిన నీరు సురక్షితమేనా అనే అనుమానం రావచ్చు. అయితే, అధునాతన మల్టీ-స్టేజ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ద్వారా బ్యాక్టీరియా, హానికర రసాయనాలను పూర్తిగా తొలగిస్తారు. కాబట్టి ఈ నీరు సాధారణ RO నీటి కంటే కూడా 100శాతం స్వచ్ఛమైనది. సురక్షితమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us