AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే…!

విశాఖపట్నంలోని ప్రసిద్ధ ఆర్కే బీచ్‌లో ఒక పర్యాటకుడికి త్రుటిలో ప్రాణపాయం తప్పింది. రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు అనే వ్యక్తి సముద్రంలో జలకాలాడేందుకు దిగగా, ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలలు అతడిని లోపలికి లాక్కెళ్లాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన లైఫ్‌గార్డ్స్ సకాలంలో స్పందించి, ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం అతడికి త్రీటౌన్ సీఐ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

Watch: రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
Rk Beach Tourist Rescue
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 30, 2026 | 11:02 AM

Share

అందమైన సాగరతీరం ఆహ్లాదకరమైన వాతావరణం ఆర్కే బీచ్ సొంతం. అందుకే పర్యాటకులను ఇక్కడి ప్రకృతి సుందర దృశ్యాలు కట్టిపడేస్తుంటాయి. మెత్తటి ఇసుకతిన్నెల్లో నడుస్తూ.. చల్లని పిల్ల గాలులను ఆస్వాదిస్తూ.. కాలికి నెమ్మదిగా తాకుతున్న కెరటాలను చూసి ఫిదా అవక తప్పదు. కవ్వించే కెరటాలలో కొద్దిగా సరదాగా జలకలాడాలని అనుకుంటారు సందర్శకులు. కొన్ని సందర్భాల్లో అవే కెరటాలు అమాంతంగా తనలోకి లాగేస్తాయి. ఇటువంటి సందర్భంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం తలెత్తుతోంది. పరిస్థితులు అర్థం చేసుకోక సముద్రంలో దిగి కెరటాల్లో కొట్టుకుపోతుంటారు సందర్శకులు. కొన్ని సందర్భాల్లో అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై రక్షిస్తారు. ఈరోజు ఆర్కే బీచ్ లో ఓ సందర్శకుడు కెరటాల్లో కొట్టుకుపోతూ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

విశాఖ ఆర్కే బీచ్ లో సందర్శకుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు.. ఆర్కే బీచ్ కి వెళ్ళాడు. అక్కడ కెరటాలలో జలకాలాడుతున్నాడు. ఒక్కసారిగా వచ్చిన రాకాసి కెరటం అమాంతంగా వెనక్కు లాగేసింది. దీంతో పట్టు తప్పిన ఈశ్వరరావు.. సముద్రంలో కొట్టుకుపోతున్నాడు. బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కెరటాల్లో చిక్కుకొని బయటపడలేకపోతున్నాడు.

అది గమనించి సమీపంలో ఉన్న లైఫ్‌గార్డ్స్ సకాలంలో స్పందించారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకారు. కెరటాల్లో కొట్టుకుపోతున్న ఈశ్వరరావును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సేఫ్గా రెస్క్యూ చేసి త్రీటౌన్ సీఐకి అప్పగించారు. సముద్ర స్నానాల ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు. సముద్ర అలల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అవగాహన లేకపోతే దిగకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..
పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..