AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నొప్పి తగ్గించే ఇంజెక్షన్, కిక్కిచ్చే మత్తుమందుగా మారిందా ?

నొప్పి తగ్గించే ఇంజెక్షన్, కిక్కిచ్చే మత్తుమందుగా మారిందా ?

Phani CH
|

Updated on: Sep 19, 2026 | 4:43 PM

Share

ఏలూరు జిల్లాలో ట్రామడాల్‌ ఇంజెక్షన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. మక్కినవారిగూడెంలోని ఓ మెడికల్‌ షాపు రెండేళ్లలో 13 వేలకుపైగా ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించినట్లు కథనం చెబుతోంది. మరో ఘటనలో పాఠశాల సమీపంలో వాడిన, సీల్‌ చేయని ట్రామడాల్‌ వయల్స్‌, సిరంజిలు భారీగా లభించాయి. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే వినియోగించాల్సిన ఈ ఔషధాలు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడికి వెళ్లాయన్నదే ఇప్పుడు అధికారుల ముందున్న ప్రధాన ప్రశ్నగా మారింది.

ఏలూరు జిల్లా మక్కినవారిగూడెంలో ఒక చిన్న మెడికల్ షాపు. కానీ ఈషాపు రెండేళ్ల కొనుగోళ్ల లెక్క చూస్తే 13 వేల మత్తు ఇంజెక్షన్లు! ఇదేమీ చిన్నవిషయం కాదు. ఎందుకంటే ఇది పారాసిటమాల్ కాదు, సాధారణ పెయిన్‌కిల్లర్ అంతకన్నా కాదు. ట్రామడాల్ ఒక ఓపియాయిడ్ పెయిన్‌కిల్లర్. దుర్వినియోగం అయితే వ్యసనానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం 2018లో ట్రామడాల్‌ను NDPS చట్టం పరిధిలోని సైకోట్రోపిక్ పదార్థాల జాబితాలో చేర్చింది. ఇప్పుడు ఇష్యూ 800ఇంజెక్షన్లు దొరికాయన్నది కాదు. నిందితులను అరెస్ట్ చేశారన్నది కూడా కాదు. 13వేల ఇంజెక్షన్లు ఎక్కడకు వెళ్లాయన్నదే అసలు ఇష్యూ. అంతెందుకు రెండురోజుల కిదంట ఏలూరు జిల్లాలోనే సేమ్ ఇష్యూలో ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ అరెస్ట్ అయ్యాడు. వేగవరం హైస్కూల్ పరిసరాల్లోని తోటలోకి బుధవారం ఉదయం వెళ్లిన రైతులకు వాడేసినవి, ఇంకా సీల్ కూడా తీయని ట్రామడెక్స్, ట్రామెక్ బ్రాండ్ల వయల్స్‌తో పాటు సిరంజిలు భారీగా కుప్పలుగా పడి ఉండటం కనిపించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా కనీసం ముట్టుకోవడానికి కూడా వీల్లేని ఈ నార్కోటిక్ మందులు పాఠశాల పక్కనే కనిపించడంతో గ్రామస్తులు విస్తుపోయి విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. వయల్స్‌పై ఉన్న బ్యాచ్ నంబర్లు, తయారీ కంపెనీల వివరాల ఆధారంగా లోతైన ఆడిట్ చేపట్టగా, స్థానిక ఏజెన్సీల ద్వారానే ఇవి పంపిణీ అయినట్లు స్పష్టమైంది. అధికారుల తనిఖీల్లో పట్టణంలోని పాత బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం సమీపంలో ని ‘లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ’ వికృత రూపం బయటపడింది. గడచిన మూడు నెలల వ్యవధిలోనే హైదరాబాద్ నుంచి సుమారు 20 వేల ‘ట్రామడెక్స్’ ఇంజెక్షన్లను ఈ ఏజెన్సీ తెప్పించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఇంత భారీ మొత్తంలో వచ్చిన ఔషధాలను ఎవరికి విక్రయించారు? బిల్లులు ఎక్కడ? అన్న ప్రశ్నలకు నిర్వాహకుడు కిశోర్ నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. ట్రామడాల్‌ వైద్యపరంగా చాలా కీలకమైన డ్రగ్. తీవ్రమైన నొప్పి, ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి వంటి సందర్భాల్లో వైద్యులు దీన్ని సూచిస్తారు. ఇది షెడ్యూల్-హెచ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్. ఇంజెక్షన్ రూపంలోనూ అందుబాటులో ఉంటుంది. అంటే ట్రామడాల్ స్వతహాగా ప్రమాదకరమైన అక్రమ డ్రగ్ కాదు. అవసరమైన రోగికి… సరైన మోతాదులో… వైద్యుల సూచన మేరకు ఉపయోగించే ఔషధం. కానీ వైద్యుల సూచన లేకుండా వాడితే ప్రాణాలకే ప్రమాదం. అలాంటి డేంజర్ డ్రగ్ కుప్పలు తెప్పలుగా ఏలూరు జిల్లాలోని కొన్ని మెడికల్ షాపుల్లో బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం తనిఖీల్లో బయటపడ్డ వేలాది ఇంజెక్షన్లు ఎక్కడికివెళ్లాయన్నదే అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 2: జైలర్ 2 సెన్సార్ విషయంలో మేకర్స్ హర్ట్ అయ్యారా..?

ఎల్పీజీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్స్‌

UPI కొత్త నిబంధనలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి అమలు

AIకి చెక్‌ పెట్టకపోతే ముప్పు తప్పదన్న నిపుణులు.. ట్రాష్ అంటూ కొట్టిపారేసిన ట్రంప్‌

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

Follow Us